Hansika Motwani: దేశముదురుతో టాలీవుడ్ కుర్రాళ్ళ మనసు గిల్లేసిన హన్సిక ఆ తర్వాత ఎన్టీఆర్, రవితేజ లాంటి హీరోలతో నటించినా పెద్దగా కలిసిరాలేదు. బొద్దుగా ఉండే హన్సిక కాస్త సన్నబడి మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టి గోపీచంద్, సందీప్ కిషన్ లాంటి హీరోలతో తెలుగులో వరస సినిమాలు చేసినా భారీ అవకాశాలను మాత్రం అందుకోలేకపోతుంది. దీంతో ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ బాటలో ఓ ప్రయత్నం మొదలు పెట్టింది.
హన్సిక తెలుగులో నటిస్తున్న తొలి లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘మై నేమ్ ఈజ్ శృతి’ ఆదివారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీనివాస్ ఓంకార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రమ్య బురుగు, నాగేంద్రరాజు నిర్మిస్తున్నారు. ఫిలింనగర్ దైవసన్నిధానంలో చిత్ర పూజా కార్యక్రమాలను నిర్వహించగా తెలుగు సినిమాలతోనే కథానాయికగా ప్రయాణం ఆరంభమవగా.. తొలి లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా తెలుగులో చేయడంపై హన్సిక ఆనందం వ్యక్తం చేసింది.
ఇక హన్సిక ప్రస్తుతం మరో తమిళ సినిమాతో పాటు తెలుగులో నషా అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇప్పటికే నయనతార లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో దూసుకుపోతుండగా.. తమన్నా లాంటి సీనియర్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ ల మీద ఫోకస్ చేసి బిజీగా మారుతున్నారు. ఇప్పుడు ఇదే బాటలో హన్సిక లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో నటిస్తూ మరోసారి తన లాక్ పరీక్షించుకునే పనిలో ఉన్నట్లుగా కనిపిస్తుంది.