Hardik Pandya: టీమిండియా ఓటమిపై హార్డిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు.. జట్టు ఆటతీరుపై వెంకటేశ్ ప్రసాద్ వరుస ట్వీట్లు

నేను క్రీజులోకి వచ్చే సమయానికి ఉన్న జోరును కొనసాగించడంలో విఫలమయ్యాం. అదేజోరును కొనసాగిస్తే బాగుండేది. ఆ పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేకపోయాం అని హార్డిక్ పాండ్యా చెప్పారు.

Hardik Pandya

IND vs WI Fifth T20 Match: వెస్టిండీస్‌తో ఆదివారం రాత్రి జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఫలితంగా ఎనిమిది వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా 3-2తో సిరీస్‌ను వెస్టిండీస్ కైవసం చేసుకుంది. 2016 తరువాత ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్ లో విండీస్ చేతిలో భారత్ జట్టు ఓడిపోవటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. అయితే, టీమిండియా ఓటమిపై కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఓటమి గురించి మరీ ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. టీమిండియా ప్లేయర్స్ ఎలా ఆడారనేది నాకు తెలుసు. యువ క్రికెటర్లు వారికొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించారని హార్ధిక్ పాండ్యా అన్నారు.

Ind Vs WI : భారత్ ఓటమి, టీ20 సిరీస్ వెస్టిండీస్ కైవసం

నేను క్రీజులోకి వచ్చే సమయానికి ఉన్న జోరును కొనసాగించడంలో విఫలమయ్యాం. అదేజోరును కొనసాగిస్తే బాగుండేది. ఆ పరిస్థితులను సద్వినియోగం చేసుకోలేకపోయాం అని హార్డిక్ పాండ్యా చెప్పారు. మ్యాచ్ ప్రారంభం ముందే సవాళ్లు ఎదురవుతాయని మాకు తెలుసు.. అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నించాం, కానీ విఫలం అయ్యాం అని అన్నారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఇక్కడే జరుగుతుంది. అప్పుడు మరింత మందిఅభిమానులను కలుస్తాం అని హార్ధిక్ పాండ్యా అన్నారు.

LPL 2023 : క్రికెట్ లీగా లేదా పాముల లీగా..! మ‌రోసారి గ్రౌండ్‌లోకి వ‌చ్చిన పాము.. తృటిలో త‌ప్పించుకున్న ఉదాన‌

ఇదిలాఉంటే.. భారత్ జట్టు ఓటమిపై టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ట్వీట్ చేశారు. ఇటీవల కాలంలో టీమిండియా చాలా సాధారణ పరిమిత ఓవర్ల జట్టుగా మారింది. కొన్ని నెలల క్రితం టీ20 వరల్డ్ కప్‌కి అర్హత సాధించడంలో విఫలమైన వెస్టిండీస్ జట్టు చేతిలో ఇప్పుడు ఓడిపోయింది. సిల్లీ స్టేట్‌మెంట్స్ బదులుగా వారు ఆత్మపరిశీలన చేసుకుంటారని ఆశిస్తున్నాను అని ట్వీట్ చేశారు. వెంకటేష్ ప్రసాద్ ట్వీట్‌కు ఓ వ్యక్తి స్పందిస్తూ.. సర్.. వెస్టిండీస్ జట్టు అర్హత సాధించలేక పోయింది  50 ఓవర్ల వన్డే వరల్డ్ కప్‌కు. కానీ, నేను టీమిండియా ఆటతీరుపై మీ వ్యాఖ్యలను అంగీకరిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు వెంకటేష్ ప్రసాద్ స్పందించారు. కేవలం 50 ఓవర్లే కాదు. గత అక్టోబర్ – నవంబర్‌లో కూడా వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించలేక పోయింది. భారత జట్టు పేలవంగా ఆడటం, దానిని పెద్ద ఓటమి కాదని చెప్పడం సబబు కాదంటూ వెంకటేష్ ప్రసాద్ ట్వీట్ లో పేర్కొన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు