CM Khattar: డిగ్రీ పూర్తి చేసిన 50 ఏళ్లకు పట్టా అందుకున్న హర్యానా సీఎం

అప్పుడెప్పుడో డిగ్రీ పూర్తి చేసి వచ్చి, ఇక ఇటే ఉన్నారట. అనంతరం రాజకీయాల్లో చాలా బిజీ అయిపోయి.. ఇంకేదీ పట్టించుకోలేనంతగా పరిస్థితులు మారిపోయాయట. వాస్తవానికి తనకు ఇన్నేళ్లు ఈ విషయం గుర్తుకు కూడా లేదని ఆయన అంటున్నారు.

CM Khattar: డిగ్రీ పూర్తి చేసి 50 ఏళ్లు అయ్యా పట్టా తీసుకున్నారు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‭లాల్ ఖట్టర్. ఇంతకాలం ఆయన డిగ్రీ పట్టా తీసుకోకపోవడానికి గల కారణం, తాను చదువుకున్న కాలేజీవైపు కన్నెత్తి కూడా చూడలేదని ఆయనే వెల్లడించారు. అప్పుడెప్పుడో డిగ్రీ పూర్తి చేసి వచ్చి, ఇక ఇటే ఉన్నారట. అనంతరం రాజకీయాల్లో చాలా బిజీ అయిపోయి.. ఇంకేదీ పట్టించుకోలేనంతగా పరిస్థితులు మారిపోయాయట. వాస్తవానికి తనకు ఇన్నేళ్లు ఈ విషయం గుర్తుకు కూడా లేదని ఆయన అంటున్నారు.

Tripura: బీజేపీ ఆహ్వానానికి ఓకే అన్న తిప్రా మోతా పార్టీ.. కానీ పొత్తు కుదరదట

1972లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఖట్టర్ తన గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఆ ఏడాది నుంచి 1980 వరకు దాదాపు ఎనిమిదేళ్లు ఢిల్లీలోనే ఉన్నప్పటికీ డిగ్రీ పట్టా మాత్రం తీసుకోలేదు. దీనికి కారణం, అప్పటి నుంచి వర్సిటీకి వెళ్లకపోవడమేనని ఖట్టర్‌ వెల్లడించారు. ఢిల్లీలో ఉన్నప్పటికీ ఒక్కసారంటే ఒక్కసారి కూడా తన కాలేజీ వైపుకు వెళ్లలేదని, అసలు ఆ విషయమే మర్చిపోయినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, శుక్రవారం ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ యోగేశ్‌ సింగ్‌ చేతుల మీదుగా తన డిగ్రీ పట్టాను సీఎం ఖట్టర్ అందుకున్నారు.

Komatireddy Venkat Reddy : బూతులు తిడుతూ వారం రోజుల్లో చంపేస్తారంటూ బెదిరింపులు.. మరో వివాదంలో కోమటిరెడ్డి

ట్రెండింగ్ వార్తలు