Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. రోహిత్, డేవిడ్ వార్నర్‌ల రికార్డు బద్దలు.. ఐపీఎల్లో ఒకే ఒక్కడు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- May 9, 2024 / 09:59 PM IST
PIC Credit @ RCB
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 3 వేర్వేరు ప్రత్యర్థులపై 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్‌లను రికార్డులను బద్దలు కొట్టాడు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి 47 బంతులను ఎదుర్కొని 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో పంజాబ్ కింగ్స్ పై వెయ్యి పరుగులను పూర్తి చేసుకోవడంతో ఈ ఘనతను అందుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పై జట్లపై కూడా వెయ్యి పరుగులు చేశాడు. ఇక ఈ జాబితాలో కోహ్లి తరువాతి స్థానంలో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్‌లు ఉన్నారు. వీరిద్దరు చెరో రెండు జట్ల పై 1000 పరుగులు సాధించారు. ఢిల్లీ, కేకేఆర్ జట్లపై రోహిత్, పంజాబ్ కింగ్స్, కేకేఆర్ జట్లపై వార్నర్‌లు వెయ్యి ఫ్లస్ పరుగులు సాధించారు.
T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు ఇదే.. కెప్టెన్ ఎవరో తెలుసా?
IPLలో ఎక్కువ ప్రత్యర్థి జట్ల పై 1000 ఫ్లస్ పరుగులు చేసిన ఆటగాళ్లు..
విరాట్ కోహ్లీ – ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ పై
డేవిడ్ వార్నర్ – పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ పై
రోహిత్ శర్మ – కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పై
ఓ సీజన్లో 600 ఫ్లస్ పరుగులు..
అత్యధిక సార్లు ఓ ఐపీఎల్ సీజన్లో 600 ఫ్లస్ పరుగులు సాధించిన ఆటగాడిగా కేఎల్ రాహుల్‌తో కలిసి విరాట్ కోహ్లి నిలిచాడు. విరాట్ ఈ ఘనతను ఇప్పటి వరకు నాలుగు సార్లు అందుకున్నాడు. కోహ్లి 2013, 2016, 2023, 2024 సీజన్లలో 600 ఫ్లస్ పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 2018, 2020, 2021, 2022లో ఈ ఘనత సాధించాడు.
