T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు ఇదే.. కెప్టెన్ ఎవరో తెలుసా?
తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు తమ టీమ్‌ను వెల్లడించింది.

Sri Lanka announce squad for T20 World Cup 2024
T20 World Cup 2024 – Sri Lanka : టీ20 ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడింది. ఇప్పటికే దాదాపుగా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించగా తాజాగా శ్రీలంక క్రికెట్ బోర్డు తమ టీమ్‌ను వెల్లడించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ నడిపించనున్నాడు. చరిత్ అసలంకకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. కాగా.. ఈ జట్టులో సీనియర్ ఆటగాడు ఏంజెలో మాథ్యూస్‌కు చోటు దక్కడం గమనార్హం.
చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఐపీఎల్‌లో రాణించిన మతీశ పతిరణ పేస్ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలగే, నువాన్ తుషార, దిల్లన్ మధుశంకలు చోటు దక్కించుకున్నారు.
Mumbai Indians : ముంబై ఇండియన్స్ ముక్కలైందా? హార్దిక్, తిలక్ వర్మల మధ్య తీవ్ర వాగాద్వం?
భారత కాలమానం ప్రకారం జూన్ 2 నుంచి వెస్టిండీస్, యూఎస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది. శ్రీలంక తన తొలి మ్యాచ్‌ను జూన్ 3న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. 20 జట్లు పాల్గొంటున్న ఈ పొట్టి ప్రపంచకప్‌లో లంక జట్టు గ్రూప్-డిలో ఉంది. లంకతో పాటు బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్, నేపాల్ సైతం గ్రూప్-డిలో ఉన్నాయి.
టీ20 ప్రపంచకప్ 2024 శ్రీలంక జట్టు ఇదే..
వనిందు హసరంగ (కెప్టెన్), చరిత్ అసలంక (వైస్ కెప్టెన్), కుశాల్ మెండిస్, పాతుమ్ నిస్సంక, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, ధనంజయ డిసిల్వా, మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలగే, దుష్మంత చమీరా, నువాన్ తుషార, మతీశ పతిరణ, దిల్షన్ మధుశంక
ట్రావెలింగ్ రిజర్వ్‌లు : అసిత ఫెర్నాండో, విజయకాంత్ వియస్‌కాంత్, భానుకా రాజపక్సే, జనిత్ లియనాగే