Vitamin C Drinks : శరీరంలో ఐరన్ స్ధాయిలను పెంచే విటమిన్ సి డ్రింక్స్ ఇవే!

అలాగే శరీరానికి విటమిన్ సి అందించటంలో బీట్ రూట్ కూడా దోహదపడుతుంది. బీట్ రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బీట్ రూట్ రసాన్ని తయారు చేసుకుని తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Vitamin C Drinks

Vitamin C Drinks : మన శరీరానికి ఇనుము అవసరం. శరీరంలో తక్కువ ఐరన్ స్థాయిలు హిమోగ్లోబిన్ ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తాయి. దీంతో రక్తహీనత ఇతర ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి, మనం రెగ్యులర్ డైట్‌లో ఐరన్‌ని చేర్చుకోవడం చాలా ముఖ్యం. ఇనుము స్థాయిలను పెంచడానికి అనేక పానీయాలు ఉన్నాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే పానీయాలు రక్తహీనతను తొలగించేందుకు దోహదం చేస్తాయి. ఐరన్ స్థాయిలను పెంచడానికి మీరు ఇంట్లోనే తయారు చేసుకోగలిగే విటమిన్ సి పానీయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఇనుము లోపం నివారించుకోవటం కోసం విటమిన్ సి పానీయాల గురించి తెలుసుకోవాలంటే ముందుగా బచ్చలి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బచ్చలి రసానికి ఎక్కవ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల అన్నీఇన్నీకావు. ఇది అధిక ఐరన్ తో నిండి ఉంటుంది. విటమిన్లు B6, B2, K, E, కెరోటినాయిడ్స్,కాపర్ వంటి వాటితోపాటు విటమిన్ సి సంవృద్ధిగా కలిగి ఉంటుంది. అలాగే దోసకాయ రసంలో కూడా ఐరన్ అధికంగానే ఉంటుంది. దీనిని తీసుకున్నా శరీరంలో రక్తం స్ధాయిలను పెంచుకోవచ్చు.

విటమిన్ సి అధికంగా ఉండే పండ్లలో ఆరెంజ్ ఒకటి… ఈ ఆరెంజ్ పండ్ల నుండి తయారు చేసిన జ్యూస్ తాగటం వల్ల విటమిన్ సి శరీరానికి లభించటంతోపాటు, ఈ పానీయం రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఇది సిట్రస్ కలిగి ఉన్నందున, చర్మానికి కూడా మంచిది. ఫైనాపిల్ విటమిన్ సి కలిగిన ఉన్న పండ్లలో ఒకటి. శరీరంలో ఐరన్ స్ధితిని మెరుగుపరచటంలో దోహదపడుతుంది. పైనాపిల్ జ్యూస్ ను తాగటం వల్ల బరువు తగ్గటంతోపాటు ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అరటిపండు మరియు తేనె కలిపి జ్యూస్ గా తయారు చేసుకుని తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలగుతుంది. అరటిపండ్లలో విటమిన్ సి ఉంటుంది. అవి శరీరానికి ఐరన్ ను అందిస్తాయి. స్ట్రాబెర్రీ ,అరటిపండు , తేనె కలిపి స్మూతీ తయారు చేసుకుని తీసుకుంటే రుచికరంగా ఉండటంతోపాటు ఆరోగ్యానికి ప్రయోజనం కలిగిస్తుంది.

అలాగే శరీరానికి విటమిన్ సి అందించటంలో బీట్ రూట్ కూడా దోహదపడుతుంది. బీట్ రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బీట్ రూట్ రసాన్ని తయారు చేసుకుని తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బీట్ రూట్ రసాన్ని నేరుగా తాగలేని వారు దీనికి కాస్త ఉప్పు, మిరియాల పొడి కలుపుకుని తాగవచ్చు. అన్ని వయస్సుల వారు దీనిని తీసుకోవచ్చు. పుచ్చకాయ, దానిమ్మ రసం తీసుకోవటం ద్వారా శరీరంలో ఐరన్ లోపాన్ని సరిచేసుకోవచ్చు. పుచ్చకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తుంది. కొన్ని పుచ్చకాయ ముక్కలు, దానిమ్మ ,పుదీనా ఆకులను తీసుకొని కొంచెం చక్కెర, తేనె , ఉప్పు , నిమ్మరసం కలిపి జ్యూస్ లా తయారు చేసుకుని తాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.

స్ట్రా బెర్రీ, కివీ డ్రింక్ ఐరన్ స్ధాయిలను పెంచటంలో బాగా దోహదపడుతుంది. వీటిలో విటమిన్ సి, బి1, బి9, బి6 బి12 ఉంటాయి. ఈ పానీయాన్ని తాగడం వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. ఇన్ ఫెక్షన్లు దరి చేరకుండా చూసుకోవచ్చు. అంతేకాదు శరీరంలో రక్తం స్ధాయిలు పెరుగుతాయి. టొమోటో రసంలో విటమిన్-ఎ, విటమిన్-సి మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అంటువ్యాధులు దరి చేరవు. మనం ఆరోగ్యకరంగా ఉండేందుకు సహాయపడుతుంది.

ట్రెండింగ్ వార్తలు