Esha Chawla : కరోనా బారిన సెలబ్రిటీలు.. మరో హీరోయిన్ ఇషాచావ్లాకి పాజిటివ్

తాజాగా సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా సోకినట్టు వెల్లడించింది ఇషా చావ్లా. ''నాకు కరోనా సోకింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. డాక్టర్స్ చెప్పినట్లు అన్ని పాటిస్తున్నాను....

Esha Chawla :  ఇటీవల రోజు రోజుకి మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్, తమిళ్, తెలుగు స్టార్లు చాలా మంది కరోనా బారిన పడ్డారు. రోజుకొకరు కరోనా బారిన పడుతున్నట్లు వాళ్ళ సోషల్ మీడియాల ద్వారా తెలియచేస్తున్నారు. వరుసగా మహేష్ బాబు, మంచు లక్ష్మి, థమన్, వరలక్ష్మి శరత్ కుమార్, సత్యరాజ్, హెబ్బా పటేల్, బండ్ల గణేష్, త్రిష … ఇలా చాలా మంది కరోనా బారిన పడుతుంటే సినీ పరిశ్రమ వర్గాల్లో ఆందోళన మొదలయింది. తాజాగా మరో హీరోయిన్ ఇషా చావ్లా కూడా కరోనా బారిన పడింది.

Bangarraju : యాంకర్లుగా మారిన బిగ్‌‍బాస్ భామలు.. నాగార్జున బాగానే సపోర్ట్ చేస్తున్నారుగా..

‘ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయిన ఇషా చావ్లా తర్వాత అప్పుడపుడు కొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం కబీర్ లాల్ దర్శకత్వంలో 6 బాషల్లో వస్తున్న “దివ్య దృష్టి” సినిమాలో మెయిన్ లీడ్ గా నటిస్తుంది. తాజాగా సోషల్ మీడియా ద్వారా తనకు కరోనా సోకినట్టు వెల్లడించింది.”నాకు కరోనా సోకింది. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను. డాక్టర్స్ చెప్పినట్లు అన్ని పాటిస్తున్నాను. మెడిసిన్స్ వాడుతున్నాను. అందరూ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తగిన జాగ్రత్తలు పాటించి సేఫ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అంటూ పోస్ట్ చేసింది. ఇషా త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు