Heavy Rains : నేడు తెలంగాణలో భారీ వర్షాలు

ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశముందని హెచ్చరించింది. ఇటు నల్లగొండ, పాలమూరు, ఖమ్మం జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఆరెంజ్‌, మరో పది జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

heavy rains : తెలంగాణలో వానలు ఆగడం లేదు. వరుణుడు ప్రతాపం చూపుతూనే ఉన్నాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశముందని హెచ్చరించింది. ఇటు నల్లగొండ, పాలమూరు, ఖమ్మం జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని 10 జిల్లాలకు ఆరెంజ్‌, మరో పది జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

రాష్ట్రంలో ఇటీవల కుండపోత వర్షం కురిపించిన అల్పపీడనం ఒడిశా నుంచి బంగాళాఖాతంలోకి వెళ్లి ఆదివారం మళ్లీ భూమిపైకి వచ్చింది. సాయంత్రం ఒడిశా తీరంపై కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిమీ ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఇవాళ భారీ వర్షాలు, రేపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు డా.నాగరత్న పేర్కొన్నారు. ఈనెల 14, 15 తేదీల్లో తగ్గిన వర్షాలు 16 నుంచి మళ్లీ పుంజుకున్నాయి.

CM KCR : భద్రాచలంలో గోదావరి తల్లికి శాంతి పూజ చేసిన సీఎం కేసీఆర్

ఇక రాజధాని హైదరాబాద్‌లో మళ్లీ వర్షం దంచికొట్టింది. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రంతా వర్షం పడుతూనే ఉంది. దీంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పలుకాలనీలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా-బెంగాల్‌ తీరాన్ని ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీంతో.. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ అధికారులు హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు