Harish Shankar: హైపర్ హరీష్.. ఫ్రస్టేషన్, హ్యాపీ.. ఏదొచ్చినా ఆగలేడు!

ఏదైనా అతే.. బాధ కలిగినా, బాధ్యత పెరిగినా.. హరీష్ శంకర్ కి ఓవర్ రియాక్ట్ అవడం బాగా అలవాటైంది. పవన్ సినిమా ఒప్పుకుంటే పొంగిపోతాడు.. ఆగమంటే రెచ్చిపోతాడు.. రెడీ అవమంటే హై రేంజ్..

Harish Shankar: ఏదైనా అతే.. బాధ కలిగినా, బాధ్యత పెరిగినా.. హరీష్ శంకర్ కి ఓవర్ రియాక్ట్ అవడం బాగా అలవాటైంది. పవన్ సినిమా ఒప్పుకుంటే పొంగిపోతాడు.. ఆగమంటే రెచ్చిపోతాడు.. రెడీ అవమంటే హై రేంజ్ చూపిస్తాడు. ఏదీ తట్టుకోలేడు.. రియాక్షన్ ఇవ్వకుండా ఉండలేడు. ఇప్పుడెందుకు హరీష్ హైపర్ యాక్టివ్ నేస్ గురించి అంటారా.. అయితే ఈ స్టోరీ చూసేయండి.

Harish Shankar-Chiranjeevi: హరీష్-చిరు.. మరో మలయాళ రీమేక్ ప్లాన్స్?!

బాక్సాఫీస్ బద్దల్ బాసింగాలే అంటూ వీర లెవెల్ లో డైరెక్టర్ హరీశ్ శంకర్ ఫోజులు కొడుతున్నాడు. ఆగిపోయింది.. ఇంకా లేట్ అవుతుంది అని ప్రచారం జరుగుతున్న భవదీయుడు భగత్ సింగ్ అతిత్వరలో సెట్స్ పైకెళ్తున్నాడని ట్వీట్ చేశాడు. రీసెంట్ గా హరిహర వీరమల్లు సెట్స్ లో పవర్ స్టార్ ను హరీశ్ కలిశాడు. వెంట మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా ఉన్నారు. ఇక ఆ ఫోటోలను షేర్ చేసిన ఈ డైరెక్టర్.. పవన్ ను కలిసిన ప్రతిసారి హార్ట్ రేట్, బ్లడ్ ప్రజర్ పెరిగే రష్ దొరకుతుందని.. టేక్ ఆఫ్ అవడానికి ఇక వెయిట్ చేయలేనని ట్వీట్ చేశాడు.

Harish Shankar: బాలీవుడ్ కి మరో తెలుగు దర్శకుడు.. డీజే సినిమా రీమేక్?

మొన్నామధ్య పవన్ తో ఉన్న ఓ ఫోటోను షేర్ చేసి.. దీన్ని గుర్తుపెట్టుకోండి.. టైమ్ వచ్చినప్పుడు ఆ ఎక్జైటింగ్ కన్వర్జేషన్ ను మీకు చెప్తా అని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత కొన్నిసార్లు కాలమే సమస్య.. కొన్నిసార్లు కాలమే సమాధానం అని పోస్ట్ చేశాడు. దీంతో భవదీయుడు భగత్ సింగ్ లేట్ కారణంగానే హరీశ్ శంకర్ ఫ్రస్టేషన్ చూపిస్తున్నాడనే ప్రచారం ఊపందుకుంది. లేటెస్ట్ గా సీఎం కేసీఆర్ వీడియో పోస్ట్ చేసి మరోసారి దూకుడు చూపించాడు. ఇప్పుడేమో భవదీయుడు భగత్ సింగ్ అతిత్వరలో స్టార్ట్ చేస్తున్నామని అన్ని ప్రశ్నలకు చెక్ పెట్టాడు. అదీ సూపర్ ఎగ్జైట్ మంట్ తో.

Harish Shnkar: పవన్-త్రివిక్రమ్‌ల బంధం.. అలకబూనిన హరీష్?

హరిహర వీరమల్లు మిగిలిన షూటింగ్ కోసం నెలన్నరకు పైగా కాల్ షీట్స్ ఇచ్చిన పవర్ స్టార్ హరీష్ శంకర్ కోసం కూడా దాదాపు అంతే సమయాన్ని కేటాయించాడు. హరీశ్ ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు అనుకున్నారో ఏమో.. ఊరించి.. ఉడికించి.. చివరికి డేట్స్ అడ్జస్ట్ చేశారు పవన్ కల్యాణ్. సో హరీశ్ మూవీ అతిత్వరలో సెట్స్ పైకెళ్లినా.. హరిహర వీరమల్లు పూర్తయిన తర్వాతే రెగ్యులర్ షూట్ లో పాల్గొంటారు పవన్. ఆపై సాయిధరమ్ తేజ్ తో వినోదయ సిత్తం, వైష్ణవ్ తేజ్ తో విక్రమ్ వేదా రీమేక్స్ ఉండొచ్చనే టాక్ వినిపిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు