Serial Actor Sireesha says She Divided from her Husband Naveen
Sireesha : మొగలిరేకులు సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ నటి శిరీష ఆ తర్వాత స్వాతిచినుకులు, రాములమ్మ, మనసు మమత, చెల్లెలి కాపురం.. లాంటి పలు సీరియల్స్ తో మెప్పించింది. ప్రస్తుతం పలు సీరియల్స్ తో, టీవీ షోలతో, యూట్యూబ్ లో వీడియోలతో అలరిస్తుంది. శిరీష నటుడు నవీన్ ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరికి ఒక బాబు కూడా ఉన్నారు. తాజాగా భర్తతో విడిపోయానంటూ సోషల్ మీడియాలో ప్రకటించి షాక్ ఇచ్చింది.
Also Read : Satyabhama Song : కాజల్ అగర్వాల్ కోసం పాట పాడిన కీరవాణి.. ‘సత్యభామ’ కోసం..
శిరీష తన పోస్ట్ లో.. నా ఫ్యాన్స్ కి, నా సన్నిహితులకు నేను ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నాను. నేను, నవీన్ భార్యాభర్తలుగా విడిపోయాము. కొన్ని పరిస్థితుల కారణంగా విడిపోయాము. ఈ సమయంలో మమ్మల్ని అర్ధం చేసుకొని మా నిర్ణయాన్ని గౌరవిస్తామని అనుకుంటున్నాను. వీలైతే మాకు అండగా ఉండండి అంతేకాని విమర్శించకండి. నవీన్ పై నాకు ఇప్పటికి గౌరవం ఉంది. నేను ఒక సెలబ్రిటీ అయినందున మీతో ఈ విషయం చెప్తున్నాను అని తెలిపింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మరింది.
ఇటీవల సినీ, టీవీ సెలబ్రిటీలలో చాలా మంది విడిపోతున్నారు. ఇప్పుడు సీరియల్ నటి శిరీష కూడా తన భర్తతో విడిపోయినట్లు ప్రకటించడంతో నెటిజన్లు తలో రకంగా స్పందిస్తున్నారు.