Love Me Trailer : ‘లవ్ మీ’ ట్రైలర్ వచ్చేసింది.. అందర్నీ చంపేసే దయ్యంతో హీరో ప్రేమ..

తాజాగా లవ్ మీ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.

Ashish Vaishnavi Chaitanya Love Me If You Dare Trailer Released

Love Me Trailer : దిల్ రాజు వారసుడు యువ హీరో ఆశిష్, బేబీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) జంటగా ‘లవ్ మీ’ సినిమా రాబోతున్న సంగతి తెలిసింది. దిల్ రాజు(Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్ లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మాణంలో అరుణ్ దర్శకత్వలో ‘లవ్ మీ’ సినిమా తెరకెక్కుతుంది. దెయ్యంతో హీరో ప్రేమాయణం అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా ఉండబోతుంది అని తెలుస్తుంది. అందుకే లవ్ మీ టైటిల్ కి If You Dare అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ MM కీరవాణి సంగీతం అందిస్తుండగా, స్టార్ సినిమాటోగ్రాఫర్ PC శ్రీరామ్ కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు.

Also Read : Sireesha : భర్తతో విడిపోయిన సీరియల్ నటి.. అతనిపై నాకు గౌరవం ఉంది అంటూ పోస్ట్..

ఇప్పటికే లవ్ మీ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. హీరో ఓ దయ్యాన్ని వెతుక్కొని వెళ్లి, ఆ దయ్యాన్ని ఎలా ప్రేమలో పడేస్తాడు, అందర్నీ చంపేసే దయ్యం హీరోని వదిలేస్తుందా అనే ఆసక్తికర అంశంతో ట్రైలర్ సాగింది. హారర్ థ్రిల్లర్ జానర్ లో ఈ సినిమా ఉండబోతుంది. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..

ఇక ఈ సినిమా మే 25న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి, రవికృష్ణ.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో వైష్ణవి, సిమ్రాన్ కాకుండా ఇంకో ముగ్గురు హీరోయిన్స్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చినట్టు సమాచారం. ఇందులో దయ్యం పాత్రని కూడా ఓ హీరోయిన్ తో వేయించినట్లు తెలుస్తుంది.