ICC U19 World Cup 2022: భవిష్యత్ క్రికెటర్ల మెరుపులు.. నేటి నుంచే ప్రపంచకప్!

వెస్టిండీస్‌లో శుక్రవారం(14 జనవరి 2022) నుంచి ప్రారంభం కానున్న అండర్-19 ప్రపంచకప్‌లో భవిష్యత్ స్టార్‌లకు మెరుపులు మెరిపించే అవకాశం ఉంది.

ICC U19 World Cup 2022: వెస్టిండీస్‌లో శుక్రవారం(14 జనవరి 2022) నుంచి ప్రారంభం కానున్న అండర్-19 ప్రపంచకప్‌లో భవిష్యత్ స్టార్‌లకు మెరుపులు మెరిపించే అవకాశం ఉంది. నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్‌ మరోసారి టైటిల్‌ నెగ్గి అగ్రస్థానంలో నిలవాలని ఉరకలేస్తోంది. కరోనా మహమ్మారి మధ్య తొలిసారిగా కరేబియన్ గడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో 16 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. భారత్‌ గ్రూప్‌ బిలో, ఆస్ట్రేలియా గ్రూప్‌ డిలో ఉన్నాయి.

రెండేళ్ల క్రితం భారత్‌ను ఓడించి తొలిసారి అండర్-19 టైటిల్‌ను గెలుచుకున్న బంగ్లాదేశ్‌ గ్రూప్-ఎలో, రెండుసార్లు విజేతలుగా నిలిచిన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ గ్రూప్-సిలో ఉన్నాయి. వీసా సమస్యల కారణంగా ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఆలస్యంగా ఇక్కడికి చేరుకుంది. వార్మప్ మ్యాచ్‌లు ఆడలేకపోయింది. ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంటాయి.

ప్రస్తుతం బయో బబుల్‌లో ఉన్న ఆటగాళ్లు.. ఈరోజు నుంచే సమరానికి సిద్ధం అవుతున్నారు. అయితే పాకిస్తాన్, జింబాబ్వే జట్లలో కొందరికి కరోనా సోకడం కాస్త ఆందోళన కలిగించిన అంశం. న్యూజిలాండ్ వారి విభజన నిబంధనల కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగింది, దాని స్థానంలో స్కాట్లాండ్ రంగంలోకి వచ్చింది. తొలిరోజు ఆస్ట్రేలియాతో ఆతిథ్య వెస్టిండీస్‌ తలపడనుండగా.., శ్రీలంకతో స్కాట్లాండ్‌ తలపడనుంది. శనివారం గయానా వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తొలి మ్యాచ్ ఆడబోతుంది.

గ్రూప్-A
బంగ్లాదేశ్, కెనడా, ఇంగ్లాండ్, UAE

గ్రూప్-B
భారతదేశం, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, ఉగాండా

గ్రూప్-C
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, పాపువా న్యూ గినియా, జింబాబ్వే

గ్రూప్-D
ఆస్ట్రేలియా, స్కాట్లాండ్, శ్రీలంక, వెస్టిండీస్

ట్రెండింగ్ వార్తలు