Maharashtra Politics: ఈపాటికి సీఎం షిండే ఆత్మహత్య చేసుకునేవారు.. మహా విద్యామంత్రి సంచలన వ్యాఖ్యలు

షిండే వర్గం తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా తలకిందులు అయ్యాయి. ఆ తిరుగుబాటు గురించి దీపక్ ప్రస్తావిస్తూ.. షిండే నిజమైన శివసైనికుడని అన్నారు. అయితే షిండేను ద్రోహి అంటూ ఎన్సీపీ, శివసేన (యూబీటీ) విమర్శలు గుప్పించడాన్ని దీపక్ తప్పు పట్టారు

Eknath Shinde

Eknath Shinde: ఈపాటికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే ఆత్మహత్య చేసుకుని ఉండేవారని ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ వీ.కేసర్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం షిండే తనకు అత్యంత సన్నిహితుడని, అసవరాల నిమిత్తం తరుచూ డబ్బులు ఇచ్చిపుచ్చుకునేంత సాన్నిహిత్యం ఉందని, అందుకే ఈ విషయం తనకు తెలుసని ఆయన అన్నారు. ఇంతకీ షిండే ఎందుకు ఆత్మహత్య చేసుకునేవారనేదానికి ఆయన సమాధానం చెప్పారు. మహా వికాస్ అగాఢీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన అనంతరం, అది ఫెయిల్ అయితే షిండే ఆత్మహత్య చేసుకునేవారట.

Amadalavalasa Constituency: ఆమదాలవలసలో మామ మరోసారి జెండా ఎగరేస్తారా.. అల్లుడు చక్రం తిప్పుతాడా?

అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో దీపక్ ఈ వ్యాఖ్యలు చేశారు. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల ప్రయోజనాలు, రాజకీయ అవకాశాలు నాశనం కాకుండా చూసుకుంటానని, అందుకు తన ప్రాణాలనైనా పోగొట్టుకోవడానికి సిద్ధమని తమతో షిండే చెప్పారట. అయితే షిండే ముఖ్యమంత్రి కావడంతో అది తప్పిందని, తిరుగుబాటు విజయవంతమైందని దీపక్ అన్నారు. పోయిన ఏడాది జూన్ 20న 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి షిండే తిరుగుబాటు చేశారు. అనంతరం జూన్ 30న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Thiruvananthapuram : నీటి అడుగున యోగా .. అబ్బురపరుస్తున్న ఇండియన్ ఆర్మీ ప్రదర్శన

షిండే వర్గం తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా తలకిందులు అయ్యాయి. ఆ తిరుగుబాటు గురించి దీపక్ ప్రస్తావిస్తూ.. షిండే నిజమైన శివసైనికుడని అన్నారు. అయితే షిండేను ద్రోహి అంటూ ఎన్సీపీ, శివసేన (యూబీటీ) విమర్శలు గుప్పించడాన్ని దీపక్ తప్పు పట్టారు. షిండేకి కాకుండా ఇంకెవరికి మద్దతిస్తామని ప్రశ్నించారు. వివిధ సందర్భాల్లో షిండేను థాకరే ఎంతలా అవమానించారో కేసర్కర్ వెల్లడించారు. ఎన్నికల వాగ్దానాలను థాకరే ఉల్లంఘించినప్పుడల్లా షిండే అడిగేవారని, అయితే షిండేను థాకరే అవమానించేవారని దీపక్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు