Revanth Reddy : కేసీఆర్ మోసాలకు అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ రెండో రాజధాని విషయంలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ రెండో రాజధాని అంశం ఆషామాషి కాదన్నారు.

Revanth Reddy (7)

KCR Frauds : దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ పార్టీ సొంత వ్యవహారంగా మార్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ పద్ధతిని నిరసిస్తున్నామని తెలిపారు. ఉత్సవాల పేరుతో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందన్నారు. అధికారులు బీఆర్ఎస్ సేవలో మునుగుతున్నారని పేర్కొన్నారు. ఇవి దశాబ్ది ఉత్సవాలు కాదు దశాబ్ది దగా అని ఎద్దేవా చేశారు. శనివారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ఈ నెల 22 నుండి దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ కార్యచరణ రూపొందిస్తున్నామని.. 119 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. 10 వైఫల్యాలతో రావణా సురుడి పది తలలకు పది పథకాల వైఫల్యాలను పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. కేజీ టూ పీజీ విద్య, ఫీజు రీయంబర్స్ మెంట్, నిరుద్యోగ భృతి, ఇంటికొక ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇల్లు, పోడు భూముల పట్టాలు, మూడు ఎకరాల భూమి, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు.

Delhi Metro Train : మెట్రో రైలులో ఇన్ స్టాగ్రామ్ రీల్స్ రికార్డింగ్ నిషేధం

పాదాల మీద చేసేది పాదయాత్ర కాబట్టి తమ సీఎల్పీ నాయకుడు పాదయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. పీఏసీ కన్వీనర్ గా మాజీమంత్రి షబ్బీర్ అలీ బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు.
త్వరలోనే బీసీ డిక్లరేషన్ చేస్తామని వెల్లడించారు. బీ నర్సింగ రావు సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తి అని అన్నారు. బీ నర్సింగ రావుకి అపాయింట్ మెంట్ ఇవ్వక పోవడం బాధాకరం… ఇప్పటికైనా కలవాలని సూచిస్తున్నామని తెలిపారు.

కేసీఆర్ ప్రభుత్వానికి సినిమా రంగంలో ఎవరు ప్రాధాన్యత ఇస్తున్నారో అందరం చూస్తున్నామని వెల్లడించారు. కేసీఆర్ మోసాలకు అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని తెలిపారు. ఉద్యమకారులంటే కేసీఆర్ కి అసూయ అన్నారు. ఉద్యమం జరిగేటప్పుడు కేటీఆర్ ఎక్కడున్నాడు? అని ప్రశ్నించారు. కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తానని బండి సంజయ్ ఇండైరెక్ట్ చెబుతున్నారని పేర్కొన్నారు.

Adipurush Controversy : ఆదిపురుష్‌లోని డైలాగ్స్‌పై మండిప‌డ్డ ముఖ్య‌మంత్రి.. ప్ర‌జ‌లు కోరితే రాష్ట్రంలో సినిమాని నిషేదిస్తాం

హైదరాబాద్ దేశ రెండో రాజధాని విషయంలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
హైదరాబాద్ రెండో రాజధాని అంశం ఆషామాషి కాదన్నారు. హైదరాబాద్ రెండో రాజధాని అయితే ఆదాయం కేంద్రానికి పోతుందా? రాష్ట్రానికి పోతుందా? అని పేర్కొన్నారు. హైదరాబాద్ రెండో రాజధాని అయి అదాయం కేంద్రానికి వెళ్తే తెలంగాణ చేతిలో చిప్ప మిగులుతుందన్నారు.

ట్రెండింగ్ వార్తలు