రుణమాఫీ ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో అర్ధం కావడం లేదు : మాజీ మంత్రి హరీశ్ రావు

కేంద్రం 800 కోట్లు ఉపాధి హామీ పథకానికి ఇచ్చింది.. రాష్ట్ర వాటా కలిపి విడుదల చేయాలి. ఆర్ధిక సంఘం నిధులు 500 కోట్లు వచ్చినా ప్రభుత్వం విడుదల చేయడం లేదని హరీశ్ రావు అన్నారు.

BRS MLA Harish Rao

Harish Rao : రాష్ట్రంలో సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. గ్రామ పంచాయతీల్లో కార్యదర్శులు సొంత డబ్బులతో పనులు చేయించారు. ఇప్పుడు వారి బదిలీ జరిగింది.. లబోదిబోమంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సోమవారం మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. పంచాయతీలకు కేంద్ర నిధులు వచ్చినా మంజూరు చేయడం లేదు. పంచాయతీ ఎన్నికలు కాకపోవడంతో 750 కోట్లు కేంద్రం నిధులు ఆపింది. అమ్మ పెట్టదు.. అడుక్కోనివ్వదు అన్న చందంగా మారింది. ప్రతిపక్షం తట్టి లేపితే కానీ రాష్ట్ర ప్రభుత్వం మేల్కొవడం లేదని హరీశ్ రావు విమర్శించారు.

Also Read : స్మిత సబర్వాల్ వాఖ్యలపై సీఎం రేవంత్ సహా కేసీఆర్, కేటీఆర్ తక్షణమే స్పందించాలి : బాల లత

కేంద్రం 800 కోట్లు ఉపాధి హామీ పథకానికి ఇచ్చింది.. రాష్ట్ర వాటా కలిపి విడుదల చేయాలి. ఆర్ధిక సంఘం నిధులు 500 కోట్లు వచ్చినా ప్రభుత్వం విడుదల చేయడం లేదని హరీశ్ రావు అన్నారు. బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండు నెలలుగా జీతం లేదు. పంచాయతీ ఎన్నికలు పెట్టకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. ప్రభుత్వ హాస్టళ్ల లో పనిచేసే కింది సిబ్బందికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జీతాలు ఇప్పటివరకు రాలేదు. అసెంబ్లీలో అవకాశం వస్తే అన్ని అంశాలపై ప్రభుత్వం దుమ్ము దులుపుతా. నాకు అవకాశం వస్తే ఎనిమిది మంది మంత్రులు అడ్డుతగులుతున్నారని హరీశ్ రావు అన్నారు.

Also Read : సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు: జగన్‌ను ప్రశ్నించిన షర్మిల

రాష్ట్రంలో సమస్యలతో రోడ్డు ఎక్కని వర్గం లేదు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తుతుంది. విద్యుత్ వినియోగంలో పెద్దగా తేడా లేదు. విద్యుత్ స్టోర్ లలో మెటీరియల్ లేదు. ఉచిత కరెంట్ పథకానికి ఒక్క రూపాయి విడుదల కాలేదు. విద్యుత్ శాఖ ఆర్ధికంగా దివాళాతీసే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలలకు కొన్నిచోట్ల కరెంట్ కట్ చేశారని హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో 91లక్షల మంది తెల్ల రేషన్ కార్డు దారులకు గృహజ్యోతీ అమలు కావడం లేదు. వృధాప్య పెన్షన్లు సక్రమంగా అందడం లేదు. మే నెల పెన్షన్ ఇప్పటి వరకు అందలేదు. పెంచిన పెన్షన్ అటుంచి పాత పెన్షన్ ఇవ్వడం లేదు. విడో పెన్షన్లు ఎనిమిది నెలలుగా ఆగిపోయాయని హరీశ్ అన్నారు.

రైతు రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధన అమలు చేస్తున్నారు. 30నుంచి 40శాతం మందికి రుణమాఫీ జరుగలేదు. కోతలు పెట్టడానికి నిబంధనలు వాడుతున్నారు. రుణమాఫీ ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో అర్ధం కావడం లేదు. ప్రభుత్వానికి చిత్త శుద్ది ఉంటే కొత్త జీఓ తెచ్చి రైతులను రుణమాఫీ వర్తింప చేయాలి. రైతు, పాస్ బుక్ ఆధారంగా రుణమాఫీ ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

 

 

ట్రెండింగ్ వార్తలు