Delhi Metro Train : మెట్రో రైలులో ఇన్ స్టాగ్రామ్ రీల్స్ రికార్డింగ్ నిషేధం

మెట్రో రైలులో రీల్స్ చేయరాదని వార్నింగ్ ఇస్తూ డీఎంఆర్సీ ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. జానీ జానీ ! యస్ పాపా? మేరింగ్ రీల్స్ ఇన్ ది మెట్రో? నో పాపా! అని అడ్వైజరీలో పేర్కొంది.

Delhi Metro train

Instagram Reels Banned : చేతిలో ఫోన్ తో ఏ దృశ్యాన్నైనా మొబైల్ ఫోన్ లో బంధిస్తున్నారు. ఇప్పుడు రీల్స్, వీడియోలు చేయడం అలవాటుగా మారింది. మెట్రో రైలు వంటి ప్రజా రవాణా వ్యవస్థలో రీల్స్ చేయడంపై నిషేధం విధించారు. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేస్తూ ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్(డీఎంఆర్సీ) వినూత్న ప్రకటన జారీ చేసింది. ట్విటర్ లో డీఎంఆర్సీ షేర్ చేసిన ఈ పోస్టు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

మెట్రో రైలులో రీల్స్ చేయరాదని వార్నింగ్ ఇస్తూ డీఎంఆర్సీ ఈ మార్గదర్శకాలు విడుదల చేసింది. జానీ జానీ ! యస్ పాపా? మేరింగ్ రీల్స్ ఇన్ ది మెట్రో? నో పాపా! అని అడ్వైజరీలో పేర్కొంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే అలాంటి కార్యకలాపాలను ఢిల్లీ మెట్రోలో నిషేధిస్తున్నట్లు టెక్ట్స్ లో రాసింది.

Vande Bharat Express Theft : వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు దొంగల బెడద.. వృద్ధురాలి నుంచి హ్యాండ్ బ్యాగ్ చోరీ

ఓపెన్ యువర్ కెమెరా, నా నా నా అని ఈ పోస్టుకు డీఎంఆర్సీ క్యాప్షన్ ఇచ్చింది. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో రియాక్షన్స్ వచ్చాయి. ఢిల్లీ మెట్రో సర్వీసుల నాణ్యతే కాదు.. హాస్యం కూడా మామూలుగా లేదని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఎంత చక్కటి, ఆకట్టుకునే క్యూట్ వార్నింగ్ ఇచ్చారని మరో యూజర్ రాశారు.

ట్రెండింగ్ వార్తలు