Infinix Note 12 : ఇండియాలో ఈరోజు నుంచే Infinix Note 12 ఫోన్ సేల్.. ధర ఎంతంటే.

Infinix Note 12 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ ఇన్ఫినిక్స్ నుంచి కొత్త Note సిరీస్ వచ్చింది. భారత మార్కెట్లో రెండు రోజుల క్రితమే Infinix Note 12 సిరీస్‌ లాంచ్ అయింది.

Infinix Note 12 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ మేకర్ ఇన్ఫినిక్స్ నుంచి కొత్త Note సిరీస్ వచ్చింది. భారత మార్కెట్లో రెండు రోజుల క్రితమే Infinix Note 12 సిరీస్‌ లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. అందులో ఒకటి బడ్జెట్ ఫోన్ Note 12, రెండోది ప్రీమియం Note 12 టర్బో.. ఈ ఫోన్ Note 12 కంటే కొంచెం ఎక్కువ ప్రీమియం.. Note 12 Turbo ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. Note 12 ఫస్ట్ సేల్ ఈ రోజు ప్రారంభం కానుందని CEO అనిష్ కపూర్ తెలిపారు. ఇన్ఫినిక్స్ నోట్ సిరీస్‌తో యూజర్లకు ప్రీమియం, అత్యుత్తమ డివైజ్ అందించడమే లక్ష్యమని కంపెనీ తెలిపింది. ఆకర్షణీయమైన డిజైన్, పర్ఫార్మెన్ విషయానికి వస్తే యూజర్లకు సరసమైన ధరలో లభించే బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. ఈ Note 12 సిరీస్ నుంచి Note 12, Note 12 Turbo రెండూ వరుసగా MediaTekHelio G88, G96 ప్రాసెసర్‌ల ద్వారా రన్ అవుతున్నాయి.

Infinix Note 12 : ఇండియాలో ధర ఎంతంటే? :
Infinix Note 12 4GB, 64GB వేరియంట్ రూ.11,999కే అందుబాటులో ఉంది. 6GB వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. యాక్సిస్ బ్యాంక్ యూజర్లు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ డెబిట్ కార్డ్ ద్వారా చేసిన కొనుగోళ్లపై రూ. 1000 విలువైన ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, నెలకు రూ. 2000 మాత్రమే నో-కాస్ట్-EMI వద్ద NOTE 12 (6+128GB)ని పొందవచ్చు. కస్టమర్‌లు ఎవరైనా Infinix అన్ని బ్యాంకులలో (Axis బ్యాంక్‌తో సహా), Bajaj Finserv EMI & Flipkart తర్వాత అన్ని NOTE 12 (4GB/6GB/8GB) మెమరీ వేరియంట్‌లలో 3 & 6 నెలల No-Cost-EMIని అందిస్తోంది.

Infinix Note 12 Goes On Sale In India Today, Price Starts At Rs 10,999 

Infinix Note 12 : స్పెసిఫికేషన్‌లు ఇవే :
Infinix Note 12, Note 12 Turbo స్మార్ట్ ఫోన్లలో 1000 NITS గరిష్టంగా 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఈ రెండు డివైజ్‌ల్లో డ్రాప్ నాచ్ స్క్రీన్ వ్యూ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చు. 92 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో వస్తాయి. DTS సరౌండ్ సౌండ్‌తో సినిమాటిక్ డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు కూడా ఉన్నాయి. Infinix Note 12, MediaTekHelio G88 ప్రాసెసర్‌తో పాటు 6GB వరకు RAM, Note 12 Turbo, MediaTek Helio G95 ప్రాసెసర్‌తో పాటు 8GB RAM, 128GB స్టోరేజ్‌తో అందిస్తుంది. Infinix Note 12, Note 12 Turbo 50 MPతో సెకండరీ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16MP కెమెరా అమర్చారు.

Read Also : Infinix Zero 5G First Sale : ఇన్ఫినిక్స్ జీరో 5G ఫస్ట్ సేల్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు