Realme Narzo N65 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి నార్జో N65 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 28నే లాంచ్..!

రియల్‌మి నార్జో N65 5జీ ఫోన్ భారత మార్కెట్లో మే 28న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ మేరకు రియల్‌మి ఇండియా ప్రెస్ నోట్‌లో ధృవీకరించింది.

Realme Narzo N65 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో వచ్చే వారం రియల్‌మి నార్జో N65 5జీ ఫోన్ లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది. కొన్ని ముఖ్య ఫీచర్లను కూడా ధృవీకరించింది. ఈ హ్యాండ్‌సెట్ డిజైన్‌ను కూడా ప్రకటించింది. పెద్ద వృత్తాకార బ్యాక్ కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది. రాబోయే హ్యాండ్‌సెట్ రియల్‌మి నార్జో N55 అప్‌గ్రేడ్ వెర్షన్ అందిస్తుంది. గత ఏప్రిల్ 2023లో మీడియాటెక్ హెలియో జీ88 చిప్‌సెట్, 64ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో లాంచ్ అయింది.

Read Also : Realme P1 Pro Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి పి1 ప్రో 5జీ ఫోన్ సేల్ మొదలైందోచ్.. ధర, స్పెషిఫికేషన్ల వివరాలివే!

రియల్‌మి నార్జో ఎన్65 5జీ ఫోన్ లాంచ్ తేదీ, ఫీచర్లు ఇవే :
రియల్‌మి నార్జో N65 5జీ ఫోన్ భారత మార్కెట్లో మే 28న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఈ మేరకు రియల్‌మి ఇండియా ప్రెస్ నోట్‌లో ధృవీకరించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ చిప్‌సెట్ ద్వారా పవర్ అందిస్తుంది. రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ ఐపీ54 రేటింగ్‌తో వస్తుంది.

ముఖ్యంగా, భారత్‌లో ఏప్రిల్ 26న లాంచ్ అయిన రియల్‌మి సి65 5జీ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 ఎస్ఓసీతో వస్తుంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ ద్వారా 4జీబీ+ 64జీబీ ఆప్షన్ ధర రూ. 10,499కు పొందవచ్చు. ఈ రియల్‌మి ఫోన్ 6.67-అంగుళాల హెచ్‌‌డీ+ డిస్‌ప్లే ఏఐ సపోర్టు 50ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ సెల్ఫీ షూటర్, 15డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది.

రియల్‌మి నార్జో N65 5జీ డిజైన్ :
రియల్‌మి నార్జో ఎన్65 5జీ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పైభాగంలో మధ్యలో పెద్ద, వృత్తాకార కెమెరా యూనిట్‌తో కనిపిస్తుంది. ఇందులో 2 కెమెరా సెన్సార్లు, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్ ఉన్నాయి. ఫోన్ ఎండ్ గోల్డెన్ కలర్ ఆప్షన్‌లో కనిపిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ రైట్ ఎడ్జ్ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. రియల్‌మి నార్జో N65 5జీ లాంచ్ తేదీకి దగ్గరగా ఉండే అవకాశం ఉంది.

రియల్‌మి నార్జో ఎన్55 ఫోన్ 6.72-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ స్క్రీన్, 64ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 8ఎంపీ సెల్ఫీ షూటర్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ హెలియో జీ88 ఎస్ఓసీ, 33డబ్ల్యూ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

Read Also : Google Pay Later Option : ఆన్‌‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? గూగుల్ పేలో 3 సరికొత్త ఫీచర్లు.. ఇప్పుడే కొనండి.. తర్వాత చెల్లించండి!

ట్రెండింగ్ వార్తలు