Poco F6 5G Launch : పవర్‌పుల్ ప్రాసెసర్‌, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పోకో F6 5జీ ఫోన్ వచ్చేసిందోచ్.. ధర, ఫీచర్లు వివరాలివే

Poco F6 5G Launch : మే 29 నుంచి పోకో F6 5జీ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లతో కస్టమర్‌లు పోకో ఎఫ్6 5జీ ప్రారంభ ధర రూ. 25,999కు పొందవచ్చు.

Poco F6 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? పోకో నుంచి సరికొత్త 5జీ ఫోన్ వచ్చేసింది. భారత మార్కెట్లో గురువారం (మే 23)న పోకో F6 5జీ ఫోన్ లాంచ్ అయింది. ఈలేటెస్ట్ పోకో F సిరీస్ ఫోన్ క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీతో వస్తుంది. ఈ 4ఎన్ఎమ్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో ఆధారితమైన ఫోన్లలో ఇది ఫస్ట్ ఫోన్. ఈ హ్యాండ్‌సెట్ 1.5కె రిజల్యూషన్‌తో ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 50ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 90డబ్ల్యూ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీతో వస్తుంది.పోకో ఎఫ్6 5జీ డిజైన్, ఇంటర్నల్‌లు చైనా మోడల్ రెడ్‌‌మి టర్బో 3 ఫోన్ ఫీచర్లతో సమానంగా ఉంటాయి.

Read Also : Realme Narzo N65 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి నార్జో N65 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 28నే లాంచ్..!

భారత్‌లో పోకో F6 5జీ ఫోన్ ధర ఎంతంటే? :
పోకో ఎఫ్6 5జీ బేస్ 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 29,999కు పొందవచ్చు. 12జీబీ ర్యామ్+256జీబీ, 12జీబీ+512జీబీ వెర్షన్‌ల ధర వరుసగా రూ. 31,999, రూ. 33,999కు పొందవచ్చు. ఈ ఫోన్ బ్లాక్, టైటానియం కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మే 29 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయానికి అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లతో కస్టమర్‌లు పోకో ఎఫ్6 5జీ ప్రారంభ ధర రూ. 25,999కు పొందవచ్చు. 12జీబీ + 256జీబీ, 12జీబీ + 512జీబీ ర్యామ్, స్టోరేజ్ వెర్షన్‌లను వరుసగా రూ. 27,999, రూ. 29,999 కొనుగోలు చేయవచ్చు.

పోకో ఎఫ్6 5జీ స్పెసిఫికేషన్లు :
డ్యూయల్ సిమ్ (నానో) పోకో ఎఫ్6 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ఓఎస్ ఇంటర్‌ఫేస్‌పై రన్ అవుతుంది. పోకో ఫోన్ కోసం 3 ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగు ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తోంది. 120హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్, 446పీపీఐ పిక్సెల్ సాంద్రతతో 6.67-అంగుళాల 1.5కె (1,220×2,712 పిక్సెల్‌లు) రిజల్యూషన్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే హెచ్‌డీఆర్10+, డల్‌బై విజన్, వైడెవన్ ఎల్1కి సపోర్టు ఇస్తుంది. 2,400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని అందించడానికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ని కలిగి ఉంది. 12జీబీ వరకు ఎల్‌పీపీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ఆక్టా-కోర్ 4ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS), ఎఫ్/1.59 ఎపర్చర్‌కు సపోర్టుతో 50ఎంపీ 1/1.9-అంగుళాల సోనీ ఐఎమ్ఎక్స్882 సెన్సార్ నేతృత్వంలోని పోకో ఎఫ్6 5జీలో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో 8ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్355 అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌లకు 20ఎంపీ ఓవీ20బీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ కొత్త ఫోన్‌లో థర్మల్ మేనేజ్‌మెంట్ పోకో ఐస్‌లూప్ కూలింగ్ టెక్నాలజీ కలిగి ఉంది.

పోకో F6 5జీ ఫోన్ 512జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్‌ను కలిగి ఉంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, జీపీఎస్/ఏజీపీఎస్, గెలీలియో, గ్లోనాస్, బీడౌ, యూఎస్‌‌బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. బోర్డ్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ఐఆర్ బ్లాస్టర్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉన్నాయి. పోకో ఎఫ్6 5జీ డాల్బీ అట్మోస్ సపోర్ట్, హై-రెస్ సర్టిఫికేషన్‌తో హైబ్రిడ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లతో వస్తుంది. ఐపీ64-రేటెడ్ డస్ట్, స్ప్లాష్-రెసిస్టెంట్ బిల్డ్‌ని కలిగి ఉంది.

అథెంటికేషన్ విషయానికి వస్తే.. :
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఫేస్ అన్‌లాక్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. పోకో 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో పోకో F6 5జీ ఫోన్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. ఈ బ్రాండ్ బాక్స్‌పై 120డబ్ల్యూ అడాప్టర్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ కొలతలు 160×74.4×7.8ఎమ్ఎమ్ పరిమాణం, బరువు 179 గ్రాములు ఉంటుంది. పోకో F6 5జీ స్పెసిఫికేషన్‌లు, డిజైన్ అంతర్జాతీయ మార్కెట్‌లకు రీబ్రాండెడ్ రెడ్‌మి టర్బో 3 అని సూచిస్తున్నాయి. రెండోది గత నెలలో సీఎన్‌వై 1,999 (దాదాపు రూ. 23వేల) ప్రారంభ ధరతో చైనాలో ఆవిష్కరించింది.

Read Also : Apple iPhone 14 Series : ఆపిల్ ఫోన్ కావాలా? ఒకే ధరకు రెండు ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు.. ఏ ఐఫోన్ కొంటే బెటర్ అంటే?

ట్రెండింగ్ వార్తలు