Apple iPhone 14 Series : ఆపిల్ ఫోన్ కావాలా? ఒకే ధరకు రెండు ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లు.. ఏ ఐఫోన్ కొంటే బెటర్ అంటే?

ఆపిల్ ఐఫోన్ 14ని రూ. 69,900కి విక్రయిస్తోంది. అయితే, ఐఫోన్ 14 ప్లస్ ఆపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో రూ. 79,900కి అందుబాటులో ఉంది.

Apple iPhone 14 Series : కొత్త ఆపిల్ ఫోన్ కొంటున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్, ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ సిరీస్ ఫోన్లు ఒకే ధరకు అమ్ముడవుతున్నాయి. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ప్రామాణిక వెర్షన్ ధరతో అధిక ధర కలిగిన ప్లస్ మోడల్‌ను అందిస్తోంది. ఈ ఐఫోన్ ఫోన్‌లు రూ. 60వేల లోపు ధరకే పొందవచ్చు. అయితే, మీరు ఈ రెండు ఐఫోన్లలో ఏ ఫోన్ కొనుగోలు చేయాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Realme Narzo N65 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? రియల్‌మి నార్జో N65 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 28నే లాంచ్..!

ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ సేల్ :
ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ 128జీబీ స్టోరేజ్ మోడల్ ప్రస్తుతం రూ. 58,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఈ సేల్ ఈవెంట్‌ సమయంలో ఆ ఐఫోన్‌లు గతంలో అందుబాటులో ఉన్నంత ఆపిల్ స్టోర్‌ ధరలను పోల్చితే.. ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికీ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 14ని రూ. 69,900కి విక్రయిస్తోంది. అయితే, ఐఫోన్ 14 ప్లస్ ఆపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో రూ. 79,900కి అందుబాటులో ఉంది.

ఆపిల్ యూజర్లు స్టాండర్డ్ మోడల్‌పై రూ. 10,901 ఫ్లాట్ డిస్కౌంట్, ప్లస్ వేరియంట్‌పై రూ. 20,901 తగ్గింపును అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్ ఎప్పుడు ముగుస్తుందో ప్రస్తుతానికి తెలియదు. అయితే, ఐఫోన్ కొనుగోలుపై ఆసక్తి ఉన్న యూజర్లు ఈ ఆఫర్ లిమిటెడ్ పిరియడ్ ముగిసేలోపు సొంతం చేసుకోవచ్చు.

ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్.. ఏది బెటర్ అంటే? :
రెండు స్మార్ట్‌ఫోన్‌లు యూజర్లకు సున్నితమైన పర్ఫార్మెన్స్ అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే, మీరు ప్రో మోడల్‌ల మాదిరిగా అదే పర్పార్మెన్స్ పొందవచ్చు. అయితే, ఐఫోన్ అభిమానులు తగినంత మంచి ఆల్ రౌండర్ పర్ఫార్మెన్స్ కోసం దేనినైనా కొనుగోలుకు పరిగణించవచ్చు. ఆపిల్ ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌లు రెండూ ఒకే స్పెసిఫికేషన్‌లతో వస్తాయి. ప్రధాన వ్యత్యాసం బ్యాటరీ, డిస్‌ప్లే సైజులో ఉంటుంది. ప్లస్ మోడల్ పెద్ద 6.7-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. అయితే, ఐఫోన్ 14 ఫోన్ 6.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఐఫోన్ 14 సిరీస్ మోడల్‌తో వినియోగదారులు 20 గంటల వీడియో ప్లే బ్యాక్ పొందవచ్చు. మీరు ఐఫోన్ 14 ప్లస్‌ మోడల్ కొనుగోలు చేస్తే.. దాదాపు 26 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను పొందవచ్చునని ఆపిల్ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో స్టాండర్డ్ వెర్షన్‌తో పోలిస్తే.. ఆపిల్ ఐఫోన్ ప్లస్ మోడల్ చాలా లాంగ్ బ్యాటరీ లైఫ్ అందిస్తోంది. ఐఫోన్ A15 బయోనిక్ చిప్, బ్యాక్ సైడ్ 12ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ మరిన్నింటితో సహా మిగిలిన ఫీచర్లు ఒకే విధంగా ఉంటాయి.

Read Also : Google Pay Later Option : ఆన్‌‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? గూగుల్ పేలో 3 సరికొత్త ఫీచర్లు.. ఇప్పుడే కొనండి.. తర్వాత చెల్లించండి!

ట్రెండింగ్ వార్తలు