Motorola Edge 50 Fusion : మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు అదుర్స్, బ్యాంకు ఆఫర్లు ఇవే

Motorola Edge 50 Fusion : ఈ మోటోరోలా ఫోన్ మొత్తం 2 బ్యాక్ కెమెరాలు 4కె వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. 32ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా 4కె వీడియోకు సపోర్టు ఇస్తుంది.

Motorola Edge 50 Fusion : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌ ఫోన్ ప్రవేశపెట్టింది. టాప్-టైర్ ఫీచర్‌లతో ఫ్లిప్‌‌కార్ట్, మోటోరోలా వెబ్‌సైట్ భారత్ అంతటా ఉన్న ప్రధాన రిటైల్ స్టోర్‌లలో మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ మోటోరోలా ఫోన్ ధర రూ. 20,999 ప్రత్యేక ఆఫర్లతో పొందవచ్చు.

Read Also : Mahindra XUV700 AX5 : మహీంద్రా ఎక్స్‌యూవీ700 AX5 కారు వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే? పూర్తి ధరల జాబితా ఇదే!

కెమెరా ఫీచర్లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఆకట్టుకునే కెమెరా సామర్థ్యాలతో వస్తుంది. అడ్వాన్స్‌డ్ సోనీ లైటీఐఏ 700సి సెన్సార్‌తో కూడిన 50ఎంపీ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 2.0µm అల్ట్రా పిక్సెల్ కలిగి ఉంది. సెకండరీ కెమెరా 120 ఫీల్డ్ వ్యూతో 13ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, మాక్రో విజన్ టెక్నాలజీతో వైడ్ షాట్‌లు, క్లోజప్‌లను క్యాప్చర్ చేయగలదు. ఈ ఫోన్ మొత్తం 2 బ్యాక్ కెమెరాలు 4కె వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. 32ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా 4కె వీడియోకు సపోర్టు ఇస్తుంది. హైరిజల్యూషన్ రికార్డింగ్‌ను అందించే ఏకైక సెల్ఫీ కెమెరాగా నిలిచింది.

డిజైన్ :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ డిజైన్‌తో కర్వడ్ డిస్‌ప్లే, తేలికపాటి డిజైన్ కలిగి ఉంది. కేవలం 175 గ్రాముల బరువు, 7.9ఎమ్ఎమ్ మందం కలిగి ఉంటుంది. ఐపీ68 నీటి అడుగున ప్రొటెక్షన్, స్మార్ట్ వాటర్ టచ్ టెక్నాలజీని అందిస్తుంది. ఈ ఫోన్ 3 పాంటోన్-క్యూరేటెడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వేగన్ ఎండ్‌తో మార్ష్‌మల్లౌ బ్లూ, వేగన్ స్వెడ్ ఎండ్‌తో హాట్ పింక్, పీఎమ్ఎమ్ఏ (యాక్రిలిక్ గ్లాస్) ఎండ్ ఫారెస్ట్ బ్లూతో వస్తుంది.

డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్ :
ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో 6.67-అంగుళాల 144హెచ్‌‌జెడ్ 10-బిట్ పోలెడ్ కర్వ్డ్ డిస్‌ప్లే, అవుట్‌డోర్ విజిబిలిటీకి 1600 నిట్‌ల గరిష్ట ప్రకాశం కలిగి ఉంది. స్పాప్‌డ్రాగన్ 7ఎక్స్ జనరేషన్ 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. పర్ఫార్మెన్స్, జీపీయూ/సీపీయూ స్పీడ్ సమర్థవంతమైన 5జీ కనెక్టివిటీని 4ఎన్ఎమ్ చిప్‌సెట్‌కు పొందవచ్చు. ఎడ్జ్ 50 ఫ్యూజన్ గరిష్టంగా 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. 15 5జీ బ్యాండ్‌లు, వై-ఫై 6 వరకు సపోర్టు ఇస్తుంది.

బ్యాటరీ, ఆడియో :
5000ఎంఎహెచ్ బ్యాటరీతో ఫోన్ 68డబ్ల్యూ టర్బో‌పవర్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. కేవలం 15 నిమిషాల్లో ఫుల్ డే ఛార్జింగ్ అందిస్తుంది. ఒకే ఛార్జ్‌పై 30 గంటల వరకు ఉంటుంది. డాల్బీ అట్మోస్‌తో కూడిన స్టీరియో స్పీకర్‌లను హై-రెస్ ఆడియోను కలిగి ఉంది.

సాఫ్ట్‌వేర్, అప్‌డేట్స్ :
మూడు ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హెలో యూఐపై రన్ అవుతుంది. మోటో కనెక్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. డెస్క్‌టాప్ డిస్‌ప్లేలో యాప్‌లను అనుమతిస్తుంది. అదే స్క్రీన్‌పై ఫోన్ యాప్‌లు, పీసీ ఫైల్‌లను యాక్సెస్ అందిస్తుంది. ఆకట్టుకునే స్పెషిఫికేషన్లతో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

Read Also : OnePlus 12R Price Drop : ఫ్లిప్‌కార్ట్‌లో వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ ధర తగ్గిందోచ్.. ఈ ప్లాట్ డిస్కౌంట్ పొందాలంటే?

ట్రెండింగ్ వార్తలు