IPL 2023, CSK vs SRH: స‌న్‌రైజ‌ర్స్‌పై చెన్నై విజ‌యం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

IPL 2023, CSK vs SRH: : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. స‌న్‌రైజ‌ర్స్ నిర్దేశించిన 135 ప‌రుగుల ల‌క్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 18.4 ఓవ‌ర్ల‌లో ఛేదించింది.చెన్నై బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ డేవాన్ కాన్వే(77 నాటౌట్‌; 57 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ‌శ‌త‌కంతో ఆక‌ట్టుకోగా రుతురాజ్ గైక్వాడ్‌(35; 30 బంతుల్లో 2 ఫోర్లు) రాణించాడు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 21 Apr 2023 10:50 PM (IST)

    చెన్నై విజ‌యం

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. స‌న్‌రైజ‌ర్స్ నిర్దేశించిన 135 ప‌రుగుల ల‌క్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 18.4 ఓవ‌ర్ల‌లో ఛేదించింది.

  • 21 Apr 2023 10:38 PM (IST)

    8 ప‌రుగులు

    మ‌యాంక్ ద‌గ‌ర్ వేసిన ఈ ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతికి రాయుడు ఫోర్ కొట్ట‌డంతో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 16 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 119/2. డెవాన్ కాన్వే (65), అంబ‌టి రాయుడు(8)లు క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 10:31 PM (IST)

    ర‌హానే ఔట్‌

    మ‌యాంక్ మార్కండే బౌలింగ్‌లో ర‌హానే(9) షాట్‌కి య‌త్నించ‌గా మార్‌క్ర‌మ్ క్యాచ్ ప‌ట్టుకున్నాడు. దీంతో చెన్నై 110 ప‌రుగుల వ‌ద్ద (14.4వ ఓవ‌ర్) రెండో వికెట్ కోల్పోయింది. 15 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 111/2. డెవాన్ కాన్వే (64), అంబ‌టి రాయుడు(1)లు క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 10:26 PM (IST)

    9 ప‌రుగులు

    మ‌యాంక్ ద‌గ‌ర్ వేసిన ఈ ఓవ‌ర్‌లో కాన్వే ఓ ఫోర్ కొట్టడంతో 9 ప‌రుగులు వ‌చ్చాయి. 14 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 104/1. డెవాన్ కాన్వే (59), అజింక్యా ర‌హానే(8) లు క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 10:16 PM (IST)

    రుతురాజ్ ర‌నౌట్‌

    ఎట్ట‌కేల‌కు తొలి వికెట్ ప‌డింది. 11 ఓవ‌ర్‌ను ఉమ్రాన్ మాలిక్ వేశాడు. ఆఖ‌రి బంతికి కాన్వే స్ట్రెయిట్ షాట్ కొట్టాడు. అయితే.. బంతి ఉమ్రాన్ చేతిని తాకుతూ నాన్‌స్ట్రైకింగ్‌లో ఉన్న వికెట్ల‌ను తాకింది. రుతురాజ్(35) క్రీజును దాటి ముందుకు వెళ్ల‌డంతో ర‌నౌట్ అయ్యాడు. దీంతో 87 ప‌రుగుల వ‌ద్ద చెన్నై మొద‌టి వికెట్ కోల్పోయింది. 11 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 87/1. డెవాన్ కాన్వే (50), అజింక్యా ర‌హానే(0) లు క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 10:10 PM (IST)

    కాన్వే అర్ధ‌శ‌త‌కం

    మ‌యాంక్ మార్కండే బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన కాన్వే 33 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేశాడు. ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 10 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 86/0. రుతురాజ్ గైక్వాడ్(34), డెవాన్ కాన్వే (50)లు క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 10:05 PM (IST)

    నెమ్మ‌దించిన ప‌రుగుల వేగం

    ప‌వ‌ర్ ప్లే త‌రువాత చెన్నై ప‌రుగుల వేగం త‌గ్గింది. మ‌యాంక్ మార్కండే వేసిన ఎనిమిదో ఓవ‌ర్‌లో నాలుగు ప‌రుగులు రాగా ఉమ్రాన్ మాలిక్ వేసిన తొమ్మిదో ఓవ‌ర్‌లో 7 ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 77/0. రుతురాజ్ గైక్వాడ్(30), డెవాన్ కాన్వే (45)లు క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 09:57 PM (IST)

    ఆరు ప‌రుగులు

    వాషింగ్ట‌న్ సుంద‌ర్ వేసిన ఏడో ఓవ‌ర్‌లో 6 ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 66/0. రుతురాజ్ గైక్వాడ్(22), డెవాన్ కాన్వే (42)లు క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 09:50 PM (IST)

    పవ‌ర్ ప్లే

    చెన్నై ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. మార్కో జాన్సెన్ వేసిన‌ ఆరో ఓవ‌ర్‌లో డేవాన్ కాన్వే రెచ్చిపోయి ఆడాడు. ఈ ఓవ‌ర్‌లో వ‌రుస‌గా 4,4,6,4,4 లు కొట్ట‌డంతో 23 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 60/0. రుతురాజ్ గైక్వాడ్(18), డెవాన్ కాన్వే (40)లు క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 09:39 PM (IST)

    నాలుగు సింగిల్స్‌

    మార్కో జాన్సెన్ నాలుగో ఓవ‌ర్‌ను వేశాడు. ఈ ఓవ‌ర్‌లో 4 ప‌రుగులు మాత్ర‌మే రావ‌డంతో 4 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 32/0. రుతురాజ్ గైక్వాడ్(13), డెవాన్ కాన్వే (17)లు క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 09:33 PM (IST)

    కాన్వే రెండు ఫోర్లు

    మూడో ఓవ‌ర్‌ను కెప్టెన్ మార్‌క్ర‌మ్ వేశాడు. తొలి రెండు బంతుల‌ను డేవాన్ కాన్వే బౌండ‌రీలుగా మ‌ల‌చ‌గా ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 3 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 28/0. రుతురాజ్ గైక్వాడ్(11), డెవాన్ కాన్వే (15)లు క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 09:30 PM (IST)

    రెండు ఫోర్లు

    రెండో ఓవ‌ర్‌ను మార్కో జాన్సెన్ వేశాడు. మూడో బంతికి కాన్వే, ఆఖ‌రి బంతికి రుతురాజ్‌ ఫోర్ కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్ల‌కు చెన్నై స్కోరు 17/0. రుతురాజ్ గైక్వాడ్(9), డెవాన్ కాన్వే (6)లు క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 09:25 PM (IST)

    తొలి బంతికే రుతురాజ్ గైక్వాడ్ ఫోర్‌

    స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు చెన్నై బ‌రిలోకి దిగింది. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే లు ఓపెన‌ర్లుగా వ‌చ్చారు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ తొలి ఓవ‌ర్‌ను వేశాడు. తొలి బంతినే గైక్వాడ్ ఫోర్‌గా మ‌ల‌చ‌గా ఈ ఓవ‌ర్‌లో మొత్తం ఆరు ప‌రుగులు వ‌చ్చాయి.

  • 21 Apr 2023 09:07 PM (IST)

    చెన్నై ల‌క్ష్యం 135

    టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 134 ప‌రుగులు చేసింది. స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో అభిషేక్ శ‌ర్మ‌(34; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), రాహుల్ త్రిపాఠి(21) ప‌ర్వాలేద‌నిపించ‌గా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ఓ మోస్తారు స్కోరుకే ప‌రిమిత‌మైంది. చెన్నై బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా మూడు వికెట్లు తీయ‌గా ఆకాశ్ సింగ్‌, మహేశ్ తీక్షణ, ప‌తిరాన త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 21 Apr 2023 08:54 PM (IST)

    హెన్రిచ్ క్లాసెన్ ఔట్‌

    పతిరాన బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించిన క్లాసెన్‌(17) రుతురాజ్ గైక్వాడ్ చేతికి చిక్కాడు. దీంతో స‌న్‌రైజ‌ర్స్ 116 ప‌రుగుల వ‌ద్ద(17.3వ ఓవ‌ర్‌) ఆరో వికెట్ కోల్పోయింది. 18 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 119/6. మార్కో జాన్సెన్ (10), వాషింగ్ట‌న్ సుంద‌ర్ (2) క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 08:50 PM (IST)

    హెన్రిచ్ క్లాసెన్ ఫోర్

    మ‌హేశ్ తీక్ష‌ణ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్ ఓ ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 17 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 114/5. హెన్రిచ్ క్లాసెన్(16), మార్కో జాన్సెన్ (8)క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 08:36 PM (IST)

    స‌న్‌రైజ‌ర్స్‌ స‌గం వికెట్లు డౌన్‌

    ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో మ‌యాంక్ అగ‌ర్వాల్(2) స్టంపౌట్ అయ్యాడు. దీంతో స‌న్‌రైజ‌ర్స్ 95 ప‌రుగుల వ‌ద్ద(13.5వ ఓవ‌ర్‌) ఐదో వికెట్‌ను కోల్పోయింది. 14 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 97/5. హెన్రిచ్ క్లాసెన్(6), మార్కో జాన్సెన్ (2)క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 08:31 PM (IST)

    మార్‌క్ర‌మ్ ఔట్‌

    స‌న్‌రైజ‌ర్స్ స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు వికెట్లు కోల్పోయింది. మహేశ్ తీక్షణ బౌలింగ్‌లో మార్‌క్ర‌మ్‌(12) వికెట్ కీప‌ర్ ధోని క్యాచ్ ప‌ట్ట‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 90 ప‌రుగుల(12.5వ ఓవ‌ర్‌) వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 13 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 91/4. హెన్రిచ్ క్లాసెన్(3), మ‌యాంక్ అగ‌ర్వాల్‌(1) క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 08:27 PM (IST)

    త్రిపాఠి ఔట్‌

    ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో షాట్‌కు య‌త్నించిన రాహుల్ త్రిపాఠి(21) ఆకాశ్ సింగ్ చేతికి చిక్కాడు. దీంతో 84 ప‌రుగుల వ‌ద్ద(11.2 వ ఓవ‌ర్‌) స‌న్‌రైజ‌ర్స్ మూడో వికెట్ కోల్పోయింది. 12 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 86/3. మార్‌క్ర‌మ్‌(10), హెన్రిచ్ క్లాసెన్(1) క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 08:24 PM (IST)

    మార్‌క్ర‌మ్ ఫోర్‌

    మతీశా పతిరన బౌలింగ్‌లో మార్‌క్ర‌మ్ ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 7 ప‌రుగులు వ‌చ్చాయి. 11 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 83/2. రాహుల్ త్రిపాఠి(21), మార్‌క్ర‌మ్‌(8) క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 08:15 PM (IST)

    అభిషేక్ శ‌ర్మ ఔట్‌

    స‌న్‌రైజ‌ర్స్ మ‌రో వికెట్‌ను కోల్పోయింది. ర‌వీంద్ర జ‌డేజా వేసిన 9.2 ఓవ‌ర్‌లో అభిషేక్‌శ‌ర్మ‌(34) ర‌హానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 71 ప‌రుగుల వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ రెండో వికెట్ కోల్పోయింది.

  • 21 Apr 2023 08:11 PM (IST)

    త్రిపాఠి ఫోర్‌

    మోయిన్ అలీ వేసిన 8.3ఓవ‌ర్‌కు రాహుల్ త్రిపాఠి ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 70/1. అభిషేక్ శ‌ర్మ‌(34), రాహుల్ త్రిపాఠి(16) క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 08:01 PM (IST)

    పవ‌ర్ ప్లే

    స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. మహేశ్ తీక్షణ వేసిన ఆరో ఓవ‌ర్‌లో ఆఖ‌రి బంతికి అభిషేక్ శ‌ర్మ ఫోర్ కొట్టాడు. ఈ ఓవ‌ర్‌లో 10 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 45/1. అభిషేక్ శ‌ర్మ‌(24), రాహుల్ త్రిపాఠి(1) క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 07:55 PM (IST)

    హ్యారీ బ్రూక్ ఔట్‌

    దూకుడుగా ఆడే క్ర‌మంలో హ్యారీ బ్రూక్‌(18) ఔట్ అయ్యాడు. ఆకాశ్ సింగ్ వేసిన 4.2 ఓవ‌ర్‌లో హ్యారీ బ్రూక్ షాట్ ఆడ‌గా రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ అందుకోవ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ 35 ప‌రుగుల వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది. 5 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 35/1. అభిషేక్ శ‌ర్మ‌(16), రాహుల్ త్రిపాఠి(0) క్రీజులో ఉన్నారు

  • 21 Apr 2023 07:50 PM (IST)

    హ్యారీ బ్రూక్ రెండు ఫోర్లు

    తుషార్ దేశ్‌పాండే వేసిన నాలుగో ఓవ‌ర్‌లోని ఆఖ‌రి రెండు బంతుల‌ను హ్యారీ బ్రూక్ ఫోర్లుగా మ‌లిచాడు. ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 4 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 34/0. హ్యారీ బ్రూక్(18), అభిషేక్ శ‌ర్మ‌(15) క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 07:45 PM (IST)

    10 ప‌రుగులు

    స‌న్‌రైజ‌ర్స్ ఓపెన‌ర్లు క్ర‌మంగా దూకుడు పెంచుతున్నారు. ఆకాష్ సింగ్ వేసిన మూడో ఓవ‌ర్‌లోని నాలుగో బంతికి అభిషేక్ శ‌ర్మ సిక్స్ కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 10 ప‌రుగులు వ‌చ్చాయి. 3 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 23/0. హ్యారీ బ్రూక్(8), అభిషేక్ శ‌ర్మ‌(14) క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 07:41 PM (IST)

    అభిషేక్ శ‌ర్మ ఫోర్‌

    రెండో ఓవ‌ర్‌ను తుషార్ దేశ్‌పాండే వేశాడు. ఆఖ‌రి బంతికి అభిషేక్ శ‌ర్మ ఫోర్ కొట్ట‌గా ఈ ఓవ‌ర్‌లో 7 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 13/0. హ్యారీ బ్రూక్(5), అభిషేక్ శ‌ర్మ‌(7) క్రీజులో ఉన్నారు.

  • 21 Apr 2023 07:35 PM (IST)

    బ్యాటింగ్ ప్రారంభించిన స‌న్‌రైజ‌ర్స్‌

    టాస్ ఓడిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాటింగ్ ఆరంభించింది. హ్యారీ బ్రూక్, అభిషేక్ శ‌ర్మ‌లు ఓపెన‌ర్లుగా వ‌చ్చారు. మొద‌టి ఓవ‌ర్‌ను ఆకాష్ సింగ్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతిని హ్యారీ బ్రూక్ బౌండ‌రీకి త‌ర‌లించాడు. ఈ ఓవ‌ర్‌లో మొత్తం ఆరు ప‌రుగులు వ‌చ్చాయి.

  • 21 Apr 2023 07:08 PM (IST)

    సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జ‌ట్టు

    హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్(కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్

  • 21 Apr 2023 07:06 PM (IST)

    చెన్నై సూపర్ కింగ్స్ తుది జ‌ట్టు

    రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోనీ(కెప్టెన్‌), మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్‌, మతీషా పతిరానా

  • 21 Apr 2023 07:04 PM (IST)

    టాస్ గెలిచిన చెన్నై

    చిదంబరం స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు