తిహార్ జైలులో లొంగిపోయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

కేజ్రీవాల్‌కు 21 రోజుల పాటు షరతులతో కూడిన బెయిల్ దక్కడంతో ఆయన ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి.. లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ బెయిల్ గడువు కూడా ముగిసింది. దీంతో ఆయన ఇవాళ తిహార్ జైలుకి వెళ్లి లొంగిపోయారు. కేజ్రీవాల్‌కు 21 రోజుల పాటు షరతులతో కూడిన బెయిల్ దక్కడంతో ఆయన ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

జూన్ 1 వరకు ఆయనకు వచ్చిన మధ్యంతర బెయిల్ గడువు నేటితో ముగియడంతో మళ్లీ జైలుకి వెళ్లారు. అంతకుముందు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్ర కార్యాలయంలో తమ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తనకు బెయిల్ వచ్చిన 21 రోజల్లో ఒక్క నిమిషాన్నీ వృథా చేయలేదని అన్నారు.

ఇండియా కూటమి తరఫున ప్రచారం చేశానని తెలిపారు. భారత్ ను రక్షించాలని ప్రజలకు చెప్పానని అన్నారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ఆప్ కు భారీగా సీట్లు వస్తాయని చెప్పారు. తనను ఆధారాలు లేకుండానే జైల్లో పెట్టారని అన్నారు.

కాగా, జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ తన భార్య సునీత, ఢిల్లీ మంత్రులు అతిశీ, కైలాశ్, సౌరభ్ సహా పలువురితో మాట్లాడారు. అలాగే, తన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు.

నేను అమెరికా వెళ్లి ప్రభాకర్ రావును కలిశానా? అంటూ మంత్రి కోమటిరెడ్డికి హరీశ్ రావు సవాల్