Kidney Racket : ఇరాన్ కిడ్నీ రాకెట్‌ సూత్రధారి బల్లంకొండ రాంప్రసాద్ అరెస్ట్‌!

Kidney Racket : రాంప్రసాద్ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని యువకులను ఇరాన్‌కు తరలించడంలో ఇతడు కీలకపాత్ర పోషించినట్లు తేలింది.

Bellamkonda Ram Prasad Arrest

Kidney Racket : ఇరాన్ కిడ్నీ రాకెట్ కేసులో కీలక నిందితుడుని కేరళ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. బల్లంకొండ రాంప్రసాద్‌‌ను ఎర్నాకులం రూరల్ జిల్లా ఎస్పీ వైభవ్ సక్సేనా నేతృత్వంలోని పోలీస్ ప్రత్యేక దర్యాప్తు బృందం హైదరాబాద్‌లో నిందితుడు రాంప్రసాద్‌ను అదుపులోకి తీసుకుంది. విజయవాడకు చెందిన రాంప్రసాద్.. కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నట్లు సిటి బృందం గుర్తించింది.

Read Also : ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

కొద్దిరోజుల క్రితం నగరంలోని ఓ హోటల్లో తలదాచుకున్న రాంప్రసాద్ అరెస్టు చేసింది. రాంప్రసాద్ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని యువకులను ఇరాన్‌కు తరలించడంలో ఇతడు కీలకపాత్ర పోషించినట్లు తేలింది. కేరళలోని అలువాకు చెందిన మధుతో కలిసి రాంప్రసాద్ ఈ దందా నడిపినట్లు పోలీసులు గుర్తించారు. గుర్తించారు. విదేశాలకు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లో ఫేమస్ డాక్టర్‌గా రాం ప్రసాద్ చలామణీ అవుతున్నాడు. ఏపీ, తెలంగాణ నుంచి 40 మందిని ఇరాన్ పంపినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Read Also : Heavy Rains Alert : తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ.. బయటకు రావొద్దు.. జాగ్రత్త!