Heavy Rains Alert : తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ.. బయటకు రావొద్దు.. జాగ్రత్త!

Heavy Rains Alert : ఉత్తర తెలంగాణ ప్రాంతం మినహా ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

Heavy Rains Alert : తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ.. బయటకు రావొద్దు.. జాగ్రత్త!

IMD Predicts Heavy Rains in telangana ( Image Credit : Google )

Updated On : June 2, 2024 / 6:29 PM IST

Heavy Rains Alert : తెలంగాణలోకి నైరుతి పవనాలు రానున్న నేపథ్యంలో పలు జిల్లాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐఎండీ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

వర్షం పడటంతో నగర ప్రాంతాలు చల్లబడ్డయి. దాంతో అక్కడి ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందారు. ఉత్తర తెలంగాణ ప్రాంతం మినహా ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ్, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

హైదరాబాద్‌ నగరానికి వర్ష సూచన కారణంగా ఈ నెల 4, 5 తేదీల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో పలు జిల్లాలకు జూన్ 6 వరకు ఎల్లో అలర్ట్ అమల్లో ఉంటుందని, ఆయా జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 6 తర్వాత హైదరాబాద్‌ సిటీ సహా తెలంగాణ జిల్లాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

Read Also : రాష్ట్ర ఏర్పాటు జరిగిన జూన్ 2నే అద్భుతమైన మెజారిటీతో గెలిచాం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి