Team India : ఐపీఎల్ గొడ‌వ‌లు ఇక్క‌డొద్దు..! కెప్టెన్ ఎవ‌రో అంద‌రికి తెలుసు.. మాజీ క్రికెట‌ర్లు

ఐపీఎల్‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ల తాలుకు ప‌రిస్థితులు ఇక్క‌డ క‌నిపించ‌డం లేద‌ని, మాజీ ఆట‌గాళ్లు ఇర్ఫాన్ ప‌ఠాన్‌, మాథ్యూ హెడేన్‌లు చెప్పారు.

Dravid Issued Stern Warning On Hardik Rohit Saga says experts

అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 ప్ర‌పంచ‌కప్ 2024 ఘ‌నంగా ఆరంభ‌మైంది. ఇక టీమ్ఇండియా త‌న తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఆడ‌నుంది. శ‌నివారం బంగ్లాదేశ్‌తో జ‌రిగిన వార్మ‌ప్ మ్యాచ్‌లో రోహిత్ సేన ఘ‌న విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం జ‌ట్టులో మంచి వాతావ‌ర‌ణ‌మే క‌నిపిస్తోంద‌ని, ఐపీఎల్‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ల తాలుకు ప‌రిస్థితులు ఇక్క‌డ క‌నిపించ‌డం లేద‌ని, మాజీ ఆట‌గాళ్లు ఇర్ఫాన్ ప‌ఠాన్‌, మాథ్యూ హెడేన్‌లు చెప్పారు.

ఇలాంటి విష‌యాల్లో టీమ్ఇండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్ర‌విడ్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాడ‌ని, దేశం కోసం ఆడేట‌ప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా జ‌ట్టులో ఆట‌గాళ్ల మ‌ధ్య విభేదాలు లేకుండా ద్ర‌విడ్ ప‌రిష్క‌రించి ఉండొచ్చున‌ని, ఐపీఎల్‌లో గొడ‌వ‌లు ఇక్క‌డ చ‌ర్చ‌కు వ‌చ్చి ఉండ‌క‌పోవ‌చ్చున‌ని వారు అభిప్రాయ‌ప‌డ్డారు.

Rohit Sharma : అమెరికా పోలీసులు ఇలా ఉన్నారేంట్రా బాబు.. ఓ వైపు రోహిత్ శ‌ర్మ వ‌ద్ద‌ని చెబుతున్నా..!

ఈఎస్‌పీఎస్‌తో ఇర్ఫాన్ ప‌ఠాన్ మాట్లాడుతూ.. త‌న‌కు తెలిసి ఐపీఎల్‌లో ఏం జ‌రిగింద‌నే చ‌ర్చ ప్లేయ‌ర్ల మ‌ధ్య వ‌చ్చి ఉండ‌ద‌ని అన్నాడు. ప్ర‌స్తుతం కోచ్ ద్ర‌విడ్ ఫోక‌స్ మొత్తం టీ20 ప్ర‌పంచ‌క‌ప్ పైనే ఉంద‌న్నాడు. హార్దిక్ కానివ్వండి మ‌రే ఆట‌గాడైనా స‌రే వారి దృష్టంతా పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ లో విజ‌యం సాధించ‌డంపైనే ఉండాలి అని తెలిపాడు. మ‌న ద‌గ్గ‌ర సెల‌బ్రిటీ క‌ల్చ‌ర్ బాగా పెరిగిపోయింద‌ని, కొన్ని సార్లు ఇది చేటు చేసుందేమోన‌ని ఆందోళ‌న ఉంద‌న్నాడు.

నాయ‌కుడు ఎవ‌రో తెలుసు..

టీమ్ఇండియా ప్ర‌పంచ‌క‌ప్ గెలిచేందుకు ఇక్క‌డ‌కు వ‌చ్చింది. జ‌ట్టుకు నాయ‌కుడు ఎవ‌రో మీకు తెలుసు, దాని గురించి మాట్లాడాల్సిన‌ ప‌ని లేద‌ని ఆస్ట్రేలియా మాజీ ఆట‌గాడు మాథ్యూ హెడేన్ అన్నాడు. రోహిత్ నాయ‌త్వంలో టీమ్ఇండియా బ‌రిలోకి దిగ‌నుంది. ఈ జ‌ట్టుకు హార్దిక్ వైస్ కెప్టెన్‌. ఇద్ద‌రూ క‌లిసి జ‌ట్టును ముందుండి న‌డిపించాల్సిన అవ‌స‌రం ఉంది. ఐపీఎల్‌లో జ‌రిగింది ఏదైనా స‌రే అది ఇక్క‌డ‌కు చ‌ర్చ‌కు రాకూడ‌దు. ప్ర‌స్తుతం దాని గురించి మాట్లాడాల్సిన ప‌ని లేదు అని చెప్పాడు.

T20 World Cup 2024 : తొలి మ్యాచ్‌లోనే ప‌రుగుల వ‌ర‌ద‌.. అమెరికా సంచ‌ల‌న విజ‌యం..

రెండు గ్రూపులు..

ఐపీఎల్ 2024 సీజ‌న్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి రోహిత్ శ‌ర్మ‌ను త‌ప్పించి హార్దిక్ పాండ్య‌కు అప్ప‌గించారు. దీంతో ఆ జ‌ట్టు రెండు గ్రూపులుగా విడిపోయింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. హార్దిక్ నాయ‌క‌త్వంలో ముంబై దారుణ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. 10 మ్యాచుల్లో ఓడిపోయిన ఆ జ‌ట్టు పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంలో నిలిచింది. జ‌ట్టును రోహిత్ శ‌ర్మ వీడ‌నున్నాడే వార్త‌లు వ‌చ్చాయి.

ట్రెండింగ్ వార్తలు