Venkatesh Iyer : ఫ్యాషన్ డిజైనర్‌ను పెళ్లి చేసుకున్న టీమ్ఇండియా ఆల్‌రౌండర్..
టీమ్ఇండియా ఆల్‌రౌండర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటివాడు అయ్యాడు.
- Thota Vamshi Kumar
- Published on- June 2, 2024 / 02:15 PM IST
Venkatesh Iyer marries Shruti Raghunathan
Venkatesh Iyer – Shruti Raghunathan : టీమ్ఇండియా ఆల్‌రౌండర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ఓ ఇంటివాడు అయ్యాడు. తన స్నేహితురాలు శృతి రఘునాథన్‌ను ఆదివారం పెళ్లి చేసుకున్నాడు. దక్షిణ భారత సంప్రదాయ పద్దతితో అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల మధ్య వీరి పెళ్లి వేడుక జరిగింది. గతేడాది నవంబర్‌లో వెంకటేశ్-శృతి ల నిశ్చితార్థం జరిగింది. వెంకటేశ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటీజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
శృతి రఘునాథన్ విషయానికి వస్తే.. ఆమె ఓ ఫ్యాషన్ డిజైనర్. బెంగళూరులోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలో ఆమె పనిచేస్తున్నారు.
ఐపీఎల్లో వెంకటేశ్ అయ్యర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్లో కేకేఆర్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. కేకేఆర్ విజయంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్లో అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించాడు. 26 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో ప్లేఆఫ్స్‌లో వరుసగా నాలుగు అర్ధశతకాలు బాదిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.
Team India : ఐపీఎల్ గొడవలు ఇక్కడొద్దు..! కెప్టెన్ ఎవరో అందరికి తెలుసు.. మాజీ క్రికెటర్లు
ఇక టీమ్ఇండియా తరుపున రెండు వన్డేలు, తొమ్మిది టీ20 మ్యాచులు ఆడాడు. 2002 ఫిబ్రవరిలో చివరి సారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024లో వెంకటేశ్ అయ్యర్‌కు చోటు దక్కలేదు.
