The Kashmir Files Row: ది కశ్మీర్ ఫైల్స్‭పై కామెంట్స్ ఎఫెక్ట్.. ఇజ్రాయెల్ రాయబారికి విధ్వేష సందేశాలు

కశ్మీర్ ఫైల్స్ సినిమాపై నడవ్ లాపిడ్ స్పందిస్తూ ‘ఈ సినిమా చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది కేవలం ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం’’ అని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, నటుడు అనుపమ్ ఖేర్ సహా పలువురు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలోనే కాకుండా ఇజ్రాయెల్ దేశం నుంచి కూడా నడవ్‭పై విమర్శలు వచ్చాయి.

The Kashmir Files Row: ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇన్ ఇండియా జ్యూరీ చీఫ్, ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇండియాలో ఇజ్రాయెల్ రాయబారి నావొర్ గిలాన్‭ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ‘హిట్లర్ గొప్పవాడు’ తనకు ఓ వ్యక్తి చేసిన మెసేజ్‭ని ఆయన స్క్రీన్ షాట్ తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాస్తవానికి నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలను నావొర్ ఖండించారు. అంతే కాకుండా భారత ప్రభుత్వానికి క్షమాపణ కూడా చెప్పారు. అయినప్పటికీ ఆయనకు ఇలాంటి సందేశాలు రావడం విచిత్రం.

JNU Campus: కమ్యూనిస్టులు ఇండియాను వదిలేయాలి.. జేఎన్‭యూలో బ్రాహ్మణ వ్యతిరేక రాతలపై హిందూ రక్షాదళ్ ప్రతిరాతలు

కశ్మీర్ ఫైల్స్ సినిమాపై నడవ్ లాపిడ్ స్పందిస్తూ ‘ఈ సినిమా చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది కేవలం ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం’’ అని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి, నటుడు అనుపమ్ ఖేర్ సహా పలువురు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేశంలోనే కాకుండా ఇజ్రాయెల్ దేశం నుంచి కూడా నడవ్‭పై విమర్శలు వచ్చాయి.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీతో ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నందుకు ప్రభుత్వ టీచర్‌ సస్పెన్షన్

ఈ విషయం పక్కన పెడితే.. ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఇజ్రాయెల్ రాయబారికి విధ్వేష సందేశాలు వచ్చాయి. ‘మీలాంటి వ్యక్తులను అంతం చేసిన హిట్లర్ గొప్పవాడు. వెంటనే భారత్ నుంచి వెళ్లిపోండి’ అని ఆయనకు సందేశం వచ్చింది. ఆయనకు వచ్చిన మరో సందేశంలో ‘హిట్లర్ గొప్ప వ్యక్తి’ అని మరోసారి చెప్పారు. అయితే ఇది ఎవరు పంపారనే విషయంలో క్లారిటీ లేదు. కానీ, తనకు వచ్చిన ఈ సందేశాన్ని ఆయన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘ఇంకా కొందరిలో జాతి విక్ష లక్షణాలు అలాగే ఉన్నాయని ఈ పోస్ట్ ద్వారా గుర్తు చేయాలి అనుకుంటున్నా. మనమంతా కలిసికట్టుగా దీన్ని వ్యతిరేకించాలి’’ అని ట్వీట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు