Amarnath Yatra : రాంబన్ వద్ద విరిగిపడిన కొండచరియలు.. అమరనాథ్ యాత్రకు బ్రేక్

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Amarnath Yatra halted

Jammu-Srinagar highway blocked : జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ నుంచి శ్రీనగర్ వరకు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పంత చౌక్ యాత్ర బేస్ క్యాంపు నుంచి జమ్మూకు వెళ్లాల్సిన అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. (Jammu-Srinagar highway blocked due to landslide)

Rahul Gandhi : నేడు అవిశ్వాస తీర్మానంపై మాట్లాడనున్న రాహుల్

జమ్మూ-శ్రీనగర్ మారోగ్ రాంబన్ వద్ద జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటం వల్ల వాహన రాకపోకలు నిలిపివేశామని ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ అధికారులు చెప్పారు. (Amarnath Yatra halted) జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడినందున నిర్ధారణ లేకుండా ప్రజలు జాతీయ రహదారి-44పై ప్రయాణించవద్దని జమ్మూకాశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. దీనివల్ల అమరనాథ్ యాత్రను నిలిపివేశారు.

East Sikkim : తూర్పు సిక్కిం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు జవాన్లు మృతి

జులై 1వతేదీన ప్రారంభించిన అమరనాథ్ యాత్ర ఆగస్టు 31వతేదీ వరకు కొనసాగనుంది. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా అమరనాథ్ యాత్ర మార్గంలో భారీభద్రత ఏర్పాటు చేశారు. భద్రతా బలగాలతోపాటు పూంచ్ సివిల్ సొసైటీ సభ్యుల సహకారంతో అమరనాథ్ యాత్ర శాంతియుతంగా ముగిసేలా చర్యలు తీసుకున్నామని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు