JP Nadda: తెలంగాణలో పర్యటించనున్న జేపీ నడ్డా.. అమిత్ షా పర్యటనపై కూడా బీజేపీ స్పందన

కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన వాయిదాపడ్డ విషయం తెలిసిందే.

JP Nadda – BJP: బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 25న తెలంగాణ(Telangana)లో పర్యటించనున్నారు. మరికొన్ని నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ నాగర్ కర్నూల్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో నడ్డా పాల్గొంటారు.

మరోవైపు, కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన వాయిదాపడ్డ విషయం తెలిసిందే. అమిత్ షా పర్యటనను త్వరలోనే ఖరారు చేయనున్నారు. ఆయన పర్యటనను ఖమ్మంలోనే కొనసాగించాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి పదవి నుంచి బండి సంజయ్ ని తీసేసి మరొకరిని నియమించే ప్రసక్తే లేదని బీజేపీ అధిష్ఠానం తెలిపింది.

బీజేపీ తెలంగాణ నేతలంతా సమష్టిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. బీజేపీలోని ముఖ్య నేతలు అందరికీ కీలకమైన బాధ్యతలు ఉంటాయని వివరించారు. తమ పార్టీ బలపడుతుండడాన్ని ఓర్వలేకే సోషల్ మీడియాలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమ పార్టీకి, బీఆర్ఎస్ కు మధ్య ఒప్పందాలు జరిగాయని కూడా అసత్య ప్రచారం జరుగుతోందని తెలిపారు.

YS Sharmila: మీ మహమ్మారి పాలన అంతానికి.. ఇంజక్షన్ రెడీ అయ్యింది దొర గారు..!

ట్రెండింగ్ వార్తలు