Gyanvapi Survey Row: జ్ఞానవాపి మసీదు సర్వేపై తీర్పులో ‘స్వీయ భద్రతపై ఆందోళన వ్యక్తం’ చేసిన న్యాయమూర్తి

జ్ఞానవాపి మసీదుపై సర్వే నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ పై తీర్పునిచ్చిన సివిల్ జడ్జి రవి కుమార్ దివాకర్, తన భద్రతపై, కుటుంబ సభ్యుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

Gyanvapi Survey Row: ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదుపై సర్వే నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ పై తీర్పునిచ్చిన సివిల్ జడ్జి రవి కుమార్ దివాకర్, తన భద్రతపై, కుటుంబ సభ్యుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులో దాఖలైన పిటిషన్ మేరకు జ్ఞానవాపి మసీదు పరిసర ప్రాంతాల్లో సర్వే నిర్వహణ కొరకు కోర్టు కమిషనర్ తో కూడిన సర్వే బృందాన్ని సర్వే నిమిత్తం ఆదేశించింది కోర్టు. మే 7న మసీదు వద్ద జరిపిన సర్వేలో హిందూ ఆలయానికి చెందిన ఆనవాళ్లు, స్వస్తికలు బయటపడ్డాయి. దీంతో సర్వేను నిలిపివేయాలంటూ మసీదు నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో కోర్టు నియమించిన సర్వే కమిషనర్(అడ్వకేట్)..పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఆ అధికారిని సర్వే నుంచి తొలగించాలని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ సభ్యులు మరో పిటిషన్ వారణాసి జిల్లా కోర్టులో దాఖలు చేశారు.

Read Other:Udaipur Chintan Shivir : నేటి నుంచి కాంగ్రెస్ చింతన్ శివిర్.. ట్రైన్‌లో ఉదయ్‌పూర్‌కు రాహుల్‌..

ఈ పిటిషన్ పై సోమవారం(మే11న) విచారణ జరిపిన జడ్జి రవి కుమార్ దివాకర్ నేతృత్వంలోని ధర్మాసనం..కోర్టు అధికారిని తొలగించేందుకు నిరాకరించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో విచారణ జరుపుతున్న జడ్జి రవి కుమార్ దివాకర్..తన స్వీయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. “పిటిషన్ దారులు ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు, దీంతో నా కుటుంబ సభ్యులు నా భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ సివిల్ కేసును అసాధారణ కేసుగా మార్చడం ద్వారా భయానక వాతావరణం సృష్టించబడింది. నా కుటుంబం ఎల్లప్పుడూ నా భద్రత గురించి ఆందోళన చెందుతుంది మరియు వారి భద్రత గురించి నేను ఆందోళన చెందుతున్నాను. నేను ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు నా భార్య భద్రత గురించి ఆందోళనలను పదేపదే వ్యక్తం చేస్తుంది” అని న్యాయమూర్తి రవి దివాకర్ అన్నారు.

Also read:13th Century Fort: భూమిలోపల భారీ కోట: అరుణాచల్ ప్రదేశ్‌లో తవ్వకాల్లో బయటపడ్డ 13వ శతాబ్దపు కోట

కాగా, కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో సర్వే కొనసాగుతుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు కమిషనర్ అజయ్ మిశ్రాను సర్వే బృందం నుంచి తొలగించాలని దాఖలైన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. జ్ఞానవాపి మసీదుపై వీడియో సర్వే కొనసాగుతుందని, మంగళవారం (మే 17) నాటికి ఈ సర్వే పూర్తి చేయాలని ధర్మాసనం పేర్కొంది. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయ ప్రాంగణం, జ్ఞానవాపి మసీదు సముదాయంలో ఉన్న శ్రింగర్ గౌరితో సహా అనేక మంది హిందూ దేవతల దేవాలయాలు మసీదు నిర్మాణంలో ఆక్రమణకు గురయ్యాయని ఢిల్లీకి చెందిన కొందరు మహిళలు కోర్టులో పిటిషన్ వేయగా వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు ఈ సర్వేకు ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు