Kapil Dev: ఐపీఎల్‌లో అలా.. జాతీయ జట్టులో ఇలా..! టీమిండియా సీనియర్లపై కపిల్ దేవ్ మరోసారి విమర్శలు

టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఒకలా, జాతీయ జట్టుకు వచ్చేసరికి ఒకలా ప్రవర్తిస్తున్నారని, వీరికి జాతీయ జట్టుకంటే ఐపీఎల్‌నే ముఖ్యమా అంటూ కపిల్ దేవ్ ప్రశ్నించారు.

Kapil Dev

Team India Former Cricketer Kapil Dev: టీమిండియా సీనియర్ ఆటగాళ్లపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ మరోసారి విమర్శలు చేశారు. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఒకలా, జాతీయ జట్టుకు వచ్చేసరికి ఒకలా ప్రవర్తిస్తున్నారని, వీరికి జాతీయ జట్టుకంటే ఐపీఎల్‌నే ముఖ్యమా అంటూ కపిల్ దేవ్ ప్రశ్నించారు. ఇటీవల టీమిండియా క్రికెటర్లపై కపీల్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత క్రికెటర్లు అన్నీ మాకే తెలుసని అనుకుంటారని, ఎవరి సలహా అడగాలని అనుకోరని కపిల్ విమర్శించారు. ఈసారి ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీనియర్ ఆటగాళ్ల నిబద్ధతను ప్రశ్నించారు.

Rahul Dravid : కోహ్లి, రోహిత్‌ల‌ను ఆడించ‌క‌పోవ‌డానికి కార‌ణ‌మ‌దే.. మా ల‌క్ష్యం ఏంటంటే..? రాహుల్ ద్ర‌విడ్‌

ఐపీఎల్ టోర్నీ విషయానికి వచ్చేసరికి చిన్నపాటి గాయాలైనా టీమిండియా సీనియర్ ప్లేయర్లు పట్టించుకోరని, జాతీయ జట్టుకు వచ్చేసరికి చిన్న సానుకులతో విశ్రాంతి తీసుకోవడానికే పెద్దపీట వేస్తున్నారంటూ కపిల్ అన్నారు. ఈ ఏడాది చివరిలో భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరుగుతుంది. అయితే, ఆ టోర్నీకి  బుమ్రా అందుబాటులో లేకపోతే అతడికోసం సమయం వెచ్చించడం వృథానే అవుతందని కపిల్ అన్నారు.  అసలు బుమ్రాకు ఏమైంది? అతడు కోలుకున్నాడని చెబుతున్నారు. ఒకవేళ అతడు వరల్డ్ కప్ సెమీస్, ఫైనల్ నాటికైనా అందుబాటులో లేకపోతే అతడికోసం సమయం వృథా చేసినట్లే కదా అంటూ కపిల్ అన్నారు. రిషభ్ పంత్‌పై కపిల్ పొగడ్తల వర్షం కురిపించారు. పంత్ గొప్ప క్రికెటర్. అతడు ఉండుంటే మన టెస్టు క్రికెట్ మరింత బాగుండేది అని కపిల్ పేర్కొన్నారు.

Afghanistan Batsman: ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాదిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్.. వీడియో వైరల్

తరచూ సీనియర్ ప్లేయర్లు గాయాలబారిన పడుతున్నారని, ఈ పరిణామాలు పెద్ద టోర్నీలకు వచ్చేసరికి జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపుతున్నాయని కపిల్ చెప్పారు. బీసీసీఐ తీరుపైనా కపిల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్ల పనిభారం నిర్వహణపై బీసీసీఐ కూడా సరిగ్గా పనిచేయడం లేదని కపిల్ అన్నారు. ఐపీఎల్ చాలా గొప్ప లీగే.. కానీ అదే ఏదో ఒకరోజు మిమ్మల్ని నాశనం చేస్తుంది కూడా. చిన్న పాటి గాయాలు ఉన్నా మీరు ఐపీఎల్ ఆడతారు.. కానీ దేశంకోసం మాత్రం ఆడరు. దీర్ఘకాలం పాటు బ్రేక్ తీసుకుంటారు.. అది సరైన పద్దతేనా అని కపిల్ ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు