Karate Kalyani : శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నిలిపివేయాలి : కరాటే కల్యాణి

దేవుని పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ విగ్రహావిష్కరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

Karate Kalyani : ఖమ్మంలో శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణను నిలిపివేయాలని అఖిల భారత యాదవ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు కరాటే కళ్యాణి పేర్కొన్నారు. దేవుని రూపంలో ఉన్న రాజకీయ వ్యక్తిని ఆరాధించడం తమ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని చెప్పారు.

ఇది మత విద్వేశాలను రాజకీయం చేసి సమాజంలో అలజడులను సృష్టించే ప్రక్రియగా ఆమె అభివర్ణించారు. ఖమ్మం పట్టణంలోని లకారం ట్యాంక్ బండ్ లో శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ భారత యాదవ సమితి(BYS) తరపున ఖమ్మం అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.

TTD: శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయంలో వీడియో తీసిన భక్తుడిని గుర్తించిన అధికారులు.. అతడు ఎవరంటే?

అనంతరం కరాటే కల్యాణి మాట్లాడుతూ దేవుని పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్న ఈ విగ్రహావిష్కరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను నిలిపివేయాలని భారత యాదవ సమితి డిమాండ్ చేస్తోంది. ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడింది. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని పేర్కొంది.

రాజకీయ నేతను దేవుడి రూపంలో పెట్టడం కరెక్ట్ కాదని తెలిపింది. అభిమాన నటుడైనా భగవంతుడి కంటే ఎక్కువ కాదని అభిప్రాయపడింది. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విగ్రహం పెడుతున్నారని ఆరోపించింది. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు వెళతామని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు