Mann Ki Baat : మోదీజీ.. ముస్లింల మన్ కీ బాత్ వినండి.. ప్రధానికి ముస్లిం మత పెద్ద సూచన

ప్రధాని మోదీజీ..మీ మన్ కీ బాత్ కాదు ముస్లింల మన్ కీ బాత్ వినండి..దేశంలో విద్వేషాలు పెరిగిపోతున్నాయి..మీరు ఆ దిశగా ఆలోచించండి..ముస్లింల మన్ కీ బాత్ వినండి..

Listen to Muslim Mann Ki Baat

Muslim Mann Ki Baat : ప్రధాని మోదీ బన్ కీ మాత్ దేశంలో అందరికి సుపరిచితమే. కానీ ప్రధాని మోదీకి జామా మసీదు షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ (Shahi Imam Syed Ahmed Bukhari) సూచన చేస్తూ.. మోదీజీ మీరు ముస్లింల మన్ కీ బాత్ వినాలని కోరారు. “ద్వేషపూరిత తుఫాను” నుండి “దేశాన్ని రక్షించడానికి” ముస్లిం మన్ కీ బాత్ వినండి అంటూ సూచించారు. దేశంలో విద్వేషం తుపానులా విస్తరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ముస్లింల మన్‌ కీ బాత్ వినాలని ప్రధాని నరేంద్ర మోదీకి (Narendra Modi) ఆయన విజ్ఞప్తి చేశారు.

శుక్రవారం చారిత్రాత్మక మసీదులో బుఖారీ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన నూహ్ అల్లర్లు, నడుస్తున్న రైలులో రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలో కోల్పోవటం వంటి ఉదంతాలను ప్రస్తావించారు. దేశంలో విద్వేషం విస్తరిస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. విద్వేష భావన దేశ ప్రజలకు మంచిది కాదని, ఇది ఆందోళన చెందాల్సిన విషయం అంటూ ఆందోళన చెందారు. ఇటువంటి విద్వేషాలు శాంతి స్థాపనకు అత్యంత ప్రమాదకరమని అన్నారు. ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా సమాజంలో మేధావులతో చర్చించి ఇటువంటి విద్వేషాలు ప్రబలకుండా నియంత్రించాలని కోరారు. దేశంలో ఇటువంటి విద్వేషపూరిత ఘటనలు జరుగుతుండటంతో తాను ఇలా మాట్లాడవలసి వచ్చింది అంటూ బుఖారీ వివరించారు.

Rahul Gandhi : వయానాడ్ పర్యటనకు బయలుదేరిన రాహుల్ గాంధీ

‘‘మీరు తరచూ మన్ కీ బాత్ గురించి మాట్లాడతారు కాబట్టి ముస్లింల మన్ కీ బాత్‌ను ఆలకించండి. ప్రస్తుత పరిస్థితులు చూసి ముస్లింలు ఇబ్బంది పడుతున్నారు. వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. విద్వేషం, మత దాడుల నుంచి ముస్లింలను రక్షించడంలో చట్టాలు బలహీనంగా ఉన్నాయి. ఓ మతానికి చెందినవారిని బహిరంగంగానే బెదిరిస్తున్నారని. ముస్లింలను బహిష్కరించాలంటూ వారితో వ్యాపార వాణిజ్య లావాదేవాలు తెంచుకోవాలని పంచాయతీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 57 ఇస్లామిక్ దేశాలున్నాయి. ఆ దేశాల్లో ముస్లిమేతలను ఎవరు ఇటువంటి దారుణ పరిస్థితులను ఎదుర్కోవటంలేదు. వారి జీవితాలను ఎటువంటి ముప్పులేదు. వారి జీవితాలకు కూడా ఎటువంటి ప్రమాదం లేదు. కానీ ఇక్కడ మాత్రం అలా లేదు దయచేసి ఇటువంటి విద్వేష పరిస్థితులపై మేధావులతో చర్చించి చర్యలు తీసుకోండి’’ అంటూ మోదీకి బుఖారీ విన్నవించారు.

Also Read: ఎడమ చేతితో ప్రపంచం అబ్బురపడే విజయాలు సాధించింది వీరే..

హిందువుల, ముస్లింల మధ్య సత్సంబంధాలకు ఇటువంటి విద్వేష పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి అంటూ ఆయన విచారం వ్యక్తంచేశారు. భారతదేశంలో ఈ ద్వేషం ఎందుకు? అంటూ ఆవేదనగా ప్రశ్నించారు. మన పూర్వీకులు స్వాతంత్ర్యం కోసం పోరాడింది ఇటువంటి పరిస్థితుల కోసమా..? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం మేధావులతో ప్రధాని మోదీ, అమిత్ షా మాట్లాడాలని.. దేశంలోని ముస్లింల తరపున తాను కోరకుంటున్నానని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు