Mahesh Babu : మహేష్ బర్త్‌డేకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్స్.. ఏకంగా నక్షత్రాన్నే కొనేసి..

మహేశ్ బాబుపై అభిమానాన్ని చాటుకునేందుకు పలువురు అభిమానులు స్టార్ రిజిస్ట్రేషన్ ను సంప్రదించి నక్షత్రాన్ని కొనుగోలు చేశారు. ఆ నక్షత్రానికి మహేశ్ బాబు పేరు పెట్టేందుకు కావాల్సిన వివరాలను నమోదు చేయడంతో స్టార్ రిజిస్ట్రేషన్ సంస్థ ఆమోదం తెలుపుతూ నక్షత్రానికి మహేశ్ బాబు పేరును ధృవీకరించింది.

Mahesh Babu Fans Buys a Star in Galaxy and named as Super Star Mahesh Babu

Mahesh Babu :  సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు నిన్న ఆగస్టు 9న అభిమానులు ఘనంగా చేశారు. బిజినెస్ మెన్(Businessman) సినిమా రీ రిలీజ్ చేయగా థియేటర్స్ లో అభిమానులు సందడి చేశారు. అభిమానులు మహేష్ పుట్టిన రోజుని ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక కొంతమంది అభిమానులు ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఓ నక్షత్రాన్ని(Star) కొనేసి దానికి మహేష్ పేరు పెట్టేశారు.

మహేశ్ పుట్టినరోజును పురస్కరించుకొని నక్షత్ర మండలంలోని ఒక నక్షత్రానికి సూపర్ స్టార్ మహేశ్ బాబుగా నామకరణం చేసినట్లు అంతర్జాతీయ స్టార్ రిజిస్ట్రీ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు స్టార్ సర్టిఫికేషన్ ను విడుదల చేసింది. భూమధ్య రేఖకు కుడివైపు ఆరోహణలో RA 12H33M29S Dec 69° 47′ 17.6′′ లొకేషన్ లో ఉన్న నక్షత్రానికి మహేశ్ బాబు పేరు పెట్టినట్లు పేర్కొంది.

OG Movie Update : OG గ్లింప్స్.. పవర్ స్టార్ బర్త్‌డేకి అభిమానులకు స్పెషల్ గిఫ్ట్..

మహేశ్ బాబుపై అభిమానాన్ని చాటుకునేందుకు పలువురు అభిమానులు స్టార్ రిజిస్ట్రేషన్ ను సంప్రదించి నక్షత్రాన్ని కొనుగోలు చేశారు. ఆ నక్షత్రానికి మహేశ్ బాబు పేరు పెట్టేందుకు కావాల్సిన వివరాలను నమోదు చేయడంతో స్టార్ రిజిస్ట్రేషన్ సంస్థ ఆమోదం తెలుపుతూ నక్షత్రానికి మహేశ్ బాబు పేరును ధృవీకరించింది. గెలాక్సీలోని ఓ నక్షత్రానికి మహేశ్ బాబు పేరు పెట్టడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలోను సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పై ఓ అభిమాని ఇదే విధంగా తన అభిమానాన్ని చాటుకొని నక్షత్రానికి సుశాంత్ పేరు పెట్టారు. మీరు కూడా ఎవరి పేరు అయినా గెలాక్సీలలోని నక్షత్రానికి పెట్టాలంటే https://www.starregistry.com/ సంస్థని సంప్రదించొచ్చు.

ట్రెండింగ్ వార్తలు