Maoist Letter : మధ్యవర్తుల పేర్లు వెల్లడిస్తే..బందీలను వదిలేస్తాం

తారెం దాడిపై మావోయిస్టుల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ లేఖ విడుదల చేసింది. ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని మావోయిస్టుల డీకేఎస్ జెడ్ సీ ప్రతినిధి పేర్కొన్నారు.

Maoist Dandakaranya Special Zonal Committee Letter : తారెం దాడిపై మావోయిస్టుల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ లేఖ విడుదల చేసింది. ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని మావోయిస్టుల డీకేఎస్ జెడ్ సీ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ దాడిలో 23 మంది సైనికులను చంపామని తెలిపారు. 2020 నుంచి ఇప్పటివరకు 150 మంది గ్రామస్తులను మావోయిస్టు ఇన్ ఫార్మర్ల నెపంతో పోలీసులు హత్య చేశారని తెలిపారు. తమ వద్ద బందీగా ఉన్న వారిని వదిలిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు వెల్లడిస్తే..బందీలను అప్పగిస్తామని చెప్పారు. అప్పటివరకు తమ జనతన సర్కార్ లో క్షేమంగా ఉంటారని పేర్కొన్నారు. 2 వేల మంది పోలీసులు తమపై దాడికి వచ్చారని..పీఎల్జీఏను నిర్మూలించేందుకు పథకం వేశారని తెలిపారు. పోలీసులు తమకు శత్రువులు కాదని చెప్పారు. పాలకవర్గం తెచ్చిన యుద్ధంలో పోలీసులు బలిపశువులు కావొద్దన్నారు.

ప్రజలను, వనరులను, ప్రజాసంపదను కాపాడేందుకే ప్రతిదాడి చేయాల్సి వస్తోందని లేఖలో స్పష్టం చేశారు. దాడిలో 14 ఆయుధాలు, 2 వేల తూటాలు, సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మృతి చెందిన పోలీసు కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు