Khammam BRS Meeting : 100 ఎకరాల్లో సభ, 448 ఎకరాల్లో పార్కింగ్, జర్మన్ టెక్నాలజీ.. బీఆర్ఎస్ మీటింగ్‌కు ఖమ్మంలో భారీ ఏర్పాట్లు

మొత్తం 100 ఎవరాల విస్తీరణంలో ఈ సభ జరగనుంది. పార్కింగ్ కోసం 20 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వెయ్యి మంది వాలంటీర్లను సభ కోసం అందుబాటులో ఉంచారు.

Khammam BRS Meeting : ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కోసం శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 100 ఎవరాల విస్తీరణంలో ఈ సభ జరగనుంది. పార్కింగ్ కోసం 20 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. వెయ్యి మంది వాలంటీర్లను సభ కోసం అందుబాటులో ఉంచారు. నియోజకవర్గాల వారీగా ఇంచార్జిలను నియమించి జన సమీకరణ చేస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం 13 నియోజకవర్గాల నుంచి ఎక్కువగా జన సమీకరణ చేస్తున్నారు. సభకు సంబంధించిన స్టేజ్ ని జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. మొత్తం 200 మంది వీవీఐపీలు కూర్చునే విధంగా వేదికను తీర్చిదిద్దబోతున్నారు.

”ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరగబోతోంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత నిర్వహిస్తున్న తొలి సభ ఇది. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా సభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సభకు ఇతర రాష్ట్రాలకు చెందిన నలుగురు సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు” అని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.

సభ నేపథ్యంలో ఇప్పటికే ఖమ్మం నగరం.. బీఆర్ఎస్ పార్టీ హోర్డింగులు, కటౌట్లతో గులాబీమయమైంది. తొలి సభ కావడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. 100 ఎకరాల్లో సభ, 400 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. 15 వేల మంది వీఐపీలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా వారికి కేటాయించిన స్థలంలో పార్కింగ్ చేసేలా డ్రైవర్లకు క్యూఆర్ కోడ్ ఇస్తున్నారు. వీఐపీల కోసం సభా వేదిక ముందు 20 వేల కుర్చీలను ఏర్పాటు చేయనున్నారు. 3 లక్షల మంది పార్టీ కార్యకర్తలు సభకు హాజరుకాబోతున్నారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.

Also Read..Telangana politics : ఖమ్మం చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయం..రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్నీ పార్టీల గురి ఖమ్మంపైనే

ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభ చారిత్రక సభ అని, దేశ రాజకీయాలను మలుపు తిప్పే సభ అని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వంద ఎకరాల్లో బహిరంగ సభ జరుగుతుందన్నారు మంత్రి హరీశ్. 448 ఎకరాల్లో 20 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వెయ్యి మంది వాలంటీర్లు సభలో అందుబాటులో ఉంటారని, నియోజక వర్గాల వారీగా ఇన్ ఛార్జిలను నియమించి జన సమీకరణ చేస్తున్నట్టు వెల్లడించారు.

ఖమ్మంలో జరిగే ఈ సభకు 13 నియోజకవర్గాల నుంచి ఎక్కువ జన సమీకరణ చేస్తున్నామన్న మంత్రి హరీశ్.. పక్క రాష్ట్రాల నుంచి బస్సులు, వాహనాలు సమకూరుస్తున్నట్టు వివరించారు. ముఖ్య అతిథులతో పాటు ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు, నేతలు వేదికపై ఉంటారని వెల్లడించారు. మంగళవారం రాత్రికి ముఖ్య మంత్రులు, జాతీయ నేతలు హైదరాబాద్ చేరుకోనున్నారని చెప్పారు. జనవరి 18న ఉదయం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో ముగ్గురు ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు చర్చలు జరుపుతారని చెప్పారు.

Also Read..CM KCR: ఈ గోల్‌మాల్ గోవిందాలను ఎందుకు భరించాలి?: సీఎం కేసీఆర్

‘యాదాద్రి దర్శనం చేసుకుని.. రెండు హెలికాప్టర్ల లో ఖమ్మం చేరుకుంటారు. నూతన కలెక్టరేట్ ప్రారంభం తర్వాత ఖమ్మం కలెక్టరేట్ లో రెండవ విడత కంటి వెలుగు ప్రారంభిస్తారు. కంటి వెలుగు ప్రారంభం తర్వాత కలెక్టరేట్ లో నలుగురు ముఖ్యమత్రులు భోజనం చేస్తారు. సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతుంది. కళాకారులకు ప్రత్యేక వేదిక ఉంటుంది అని’ మంత్రి హరీష్ రావు వివరించారు.

ఈ నెల 18న ఖమ్మంలో మ.1 గంటకు కంటి వెలుగు- 2 కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు. 19వ తేదీన అన్ని జిల్లాల్లో ఉదయం 9 గంటలకు కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

 

ట్రెండింగ్ వార్తలు