Mehreen : సినిమాలో హీరోకి ఉన్న జబ్బు రియల్ లైఫ్ లో నాకు ఉంది : మెహరీన్

'మహానుభావుడు' సినిమాలో హీరోయిన్ మెహరీన్. ఈ సినిమాలో హీరో శర్వానంద్‌కు ఓసీడీ ఉంటుంది. అయితే తనకు రియల్‌ లైఫ్‌లో అంతకన్నా ఎక్కువ ఓసీడీ ఉందని మెహరీన్ చెప్పింది. మీరంతా కరోనా వచ్చిన

Mehreen :  ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన మెహ్రీన్‌ మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. హీరోయిన్ గా 5 ఏళ్లలోనే దాదాపు 18 సినిమాలు చేసింది. ఇటీవలే ‘మంచి రోజులు వచ్చాయి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ కి సంబంధించిన ఓ ఇంటర్వ్యూలో మెహ్రీన్ తన గురించి ఆసక్తికర విశేషాలని తెలిపింది.

Bigg Boss 5 : బిగ్ బాస్ లో ఎవరు హీరో ? ఎవరు విలన్?

‘మహానుభావుడు’ సినిమాలో హీరోయిన్ మెహరీన్. ఈ సినిమాలో హీరో శర్వానంద్‌కు ఓసీడీ ఉంటుంది. అయితే తనకు రియల్‌ లైఫ్‌లో అంతకన్నా ఎక్కువ ఓసీడీ ఉందని మెహరీన్ చెప్పింది. మీరంతా కరోనా వచ్చిన తర్వాత శానిటైజర్లు వాడుతున్నారు కానీ నాకు చాలా ఏళ్లుగా శానిటైజర్లు వాడే అలవాటు ఉంది. అప్పట్లో నా బ్యాగ్ లో 2-3 శానిటైజర్ బాటిళ్లు ఉండేవి. ఇప్పుడు 6-7 బాటిళ్లు ఉంటున్నాయి. నా మేకప్‌ స్టాఫ్ అయితే చేతులు కడుక్కొని, శానిటైజర్‌ రాసుకున్న తర్వాతే నా ఫేస్‌ టచ్‌ చేయాలి. మొదటి నుంచి నాకు ఈ ఓసీడీ ఉందని తెలిపింది ఈ క్యూట్ హీరోయిన్. ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమాలో వరుణ్ తేజ్ సరసన చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు