Ajay Kumar Puvvada : ఆయన వల్లే.. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ మారింది- మంత్రి పువ్వాడ

Ajay Kumar Puvvada : వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం 5,600 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించారు. రూ.65వేల కోట్లు రైతుబంధు ఇచ్చామన్నారు.

Puvvada Ajay Kumar-KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ మారిందన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం అనుబంధం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో మంత్రి పువ్వాడ మాట్లాడారు. తాను కూడా అగ్రికల్చర్ స్టూడెంట్ నే అని విద్యార్థులతో చెప్పారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం 5,600 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను కేసీఆర్ నియమించారని చెప్పారు.

రూ.65వేల కోట్లు రైతుబంధు ఇచ్చామన్నారు. పూర్తి అనుభవం లేకుండానే పామాయిల్ ని అత్యధికంగా పండించిన ఘనత ఇక్కడ రైతులది అని మంత్రి పువ్వాడ చెప్పారు. మీరంతా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని కోరుకుంటున్నా అని విద్యార్థులతో అన్నారు. 33 సంవత్సరాల అనుభవమున్న వ్యవసాయ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

Also Read..BJP: మా రాష్ట్రంలో ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తాం.. తెలంగాణలో మాత్రం: అసోం సీఎం హిమంత

తెలంగాణ అస్తిత్వానికి మూల పురుషుడైన ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరుతో కళాశాల ఉండటం సంతోషంగా ఉందన్నారు. అదే విధంగా జయశంకర్ విగ్రహం కళాశాలలో ఏర్పాటు చేయాలని కళాశాల మేనేజ్ మెంట్ ను మంత్రి కోరారు. ప్రతి ఏటా వ్యవసాయ కళాశాల విద్యార్థులకు కోటి 25 లక్షల రూపాయల స్కాలర్ షిప్ లు ఇస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. కాగా, హాస్టల్ ఫుడ్ పై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. ప్రతిరోజు గుడ్డు ఇవ్వాలని డీన్ కి సూచించారు మంత్రి పువ్వాడ.

ట్రెండింగ్ వార్తలు