Minister KTR : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి నిధులు ప్రకటించలేదు : మంత్రి కేటీఆర్‌

మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లను ప్రారంభించారు.

Minister KTR criticized : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఫైర్‌ అయ్యారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు నిధులు ఇవ్వాలని ఎంత కోరినా పట్టించుకోవడం లేదన్నారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా రాష్ట్రానికి ఎలాంటి నిధులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్‌, మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్లను ప్రారంభించారు. జవహర్‌నగర్‌లో డంప్‌యార్డ్‌ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామన్నారు.

మరోవైపు కేంద్ర బడ్జెట్ పై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేశారు. నిన్న కేంద్ర బడ్జెట్ పై సీఎం కేసీఆర్ మాట్లాడిన సందర్భంగా కరోనా టైంలోనూ కేంద్ర ప్రభుత్వం దరిద్రపుగొట్టు నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. ఏ వర్గానికీ కేటాయింపులు పెంచలేదన్నారు. మరి ఎవరికి పెంచినట్లు ప్రశ్నించారు. బీజేపీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు, మత పిచ్చి లేపుడు అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఎయిరిండియాను అమ్మారు…ఇప్పుడు ఎస్ఐసీ వంతు వచ్చిందన్నారు.
Fish Attack : చేప దాడిలో మత్స్యకారుడు మృతి
లాభాల్లో ఉన్న ఎల్ఐసీని ఎందుకు అమ్ముతున్నారని మోదీని అడుగుతున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ బీమా కంపెనీలకు బ్రోకర్లుగా వ్యవహరిస్తారా అని నిలదీశారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. కానీ రైతుల పెట్టుబడిని రెట్టింపు చేశారని ఎద్దేవా చేశారు. హౌసింగ్ ఫర్ ఆల్ ఉత్తి బోగస్ అని విమర్శించారు.

దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పడేయాలని కేసీఆర్ నిన్న వ్యాఖ్యానించారు. బీజేపీ విధానాల్ల దేశ రైతాంగమే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా ఈ విషయాలు వెల్లడయ్యాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

 

ట్రెండింగ్ వార్తలు