Satyabhama Trailer : స‌త్యభామ ట్రైల‌ర్‌.. కాజ‌ల్ అగ‌ర్వాల్ కుమ్మేసిందిగా..

చంద‌మామ కాజ‌ల్ అగర్వాల్ (Kajal Aggarwal) న‌టిస్తున్న మూవీ స‌త్య‌భామ‌.

Kajal Aggarwal Satyabhama Trailer : చంద‌మామ కాజ‌ల్ అగర్వాల్ (Kajal Aggarwal) న‌టిస్తున్న మూవీ స‌త్య‌భామ‌. సుమన్ చిక్కాల ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోంది. మొద‌టి సారి కాజ‌ల్ చేసిన లేడి ఓరియోంటెడ్ మూవీ ఇది. ఈ చిత్రంలో కాజ‌ల్ పోలీసాఫీస‌ర్‌గా న‌టిస్తోంది. నవీన్ చంద్ర కీల‌క పాత్ర‌ను పోషిస్తుండ‌గా అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్ తదితరులు ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 7 ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

ఇప్ప‌టికే విడుద‌లైన టీజర్, సాంగ్స్ తో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా హైద‌రాబాద్‌లోని ఐటీసీ కోహెనూర్‌లో ఈ చిత్ర ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. నంద‌మూరి అంద‌గాడు, స్టార్ హీరో బాల‌య్య ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశాడు.

Sharwanand : స‌త్య‌భామ‌కు పోటీగా వ‌స్తున్న శ‌ర్వానంద్‌..

ట్రైల‌ర్ చాలా బాగుంది. పోలీసాఫీస‌ర్‌గా కాజ‌ల్ ఇర‌గ‌దీసింది.

ట్రెండింగ్ వార్తలు