Sharwanand : స‌త్య‌భామ‌కు పోటీగా వ‌స్తున్న శ‌ర్వానంద్‌..

కొంత గ్యాప్ త‌రువాత హీరో శర్వానంద్ న‌టిస్తున్న చిత్రం ‘మనమే’.

Sharwanand : స‌త్య‌భామ‌కు పోటీగా వ‌స్తున్న శ‌ర్వానంద్‌..

Sharwanand Manamey movie Release date fix

Sharwanand Manamey : కొంత గ్యాప్ త‌రువాత హీరో శర్వానంద్ న‌టిస్తున్న చిత్రం ‘మనమే’. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. శ‌ర్వా కెరీర్‌లో 35వ సినిమా రాబోతున్న ఈ చిత్రంలో శృతి శెట్టి క‌థానాయిక‌. అబ్దుల్ వాహబ్ సంగీతాన్ని అందిస్తుండ‌గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది.

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, ఫ‌స్ట్ లుక్‌, పాట‌లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్ర బృందం సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. జూన్ 7న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు వెల్ల‌డించింది.

Devara Story Leak : వీడెవడ్రా బాబు.. ‘దేవర’ సినిమా స్టోరీ మొత్తం లీక్ చేసేశాడు.. పదివేల మందితో సీన్ ..

కాగా.. ఈ మూవీలో విక్రమ్ ఆదిత్య (దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కుమారుడు) న‌టిస్తున్నాడు. సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, రాహుల్ రవీంద్రన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోన్న స‌త్య భామ చిత్రం సైతం జూన్ 7 నే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి సుమన్ చిక్కాల ద‌ర్శ‌కుడు.నవీన్ చంద్ర కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు.