Devara Story Leak : వీడెవడ్రా బాబు.. ‘దేవర’ సినిమా స్టోరీ మొత్తం లీక్ చేసేశాడు.. పదివేల మందితో సీన్ ..

దేవర సినిమాలో రౌడీల్లో నటించిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ ని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయడంతో దేవర సినిమా గురించి ఓ రేంజ్ లో చెప్తూ కథ కూడా చెప్పేసాడు.

Devara Story Leak : వీడెవడ్రా బాబు.. ‘దేవర’ సినిమా స్టోరీ మొత్తం లీక్ చేసేశాడు.. పదివేల మందితో సీన్ ..

NTR Devara Movie Story Leaked by a Junior Artist Video goes Viral

Devara Story Leak : ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత ‘దేవర’ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ సముద్రాల ఒడ్డులో ఉండే ఊళ్ళల్లో జరిగే మాస్ కథ అని కొరటాల ఈ సినిమాపై అంచనాలు పెంచారు. ఇక రెండు పార్టులు కావడంతో దేవర పార్ట్ 1 దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. అభిమానులంతా దేవర సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే రిలీజయిన దేవర గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాలో రౌడీల్లో నటించిన ఓ జూనియర్ ఆర్టిస్ట్ ని ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేయడంతో దేవర సినిమా గురించి ఓ రేంజ్ లో చెప్తూ కథ కూడా చెప్పేసాడు.

Also Read : Yevam Teaser : ‘యేవమ్’ టీజర్ రిలీజ్.. పోలీసాఫీసర్ గా చాందిని చౌదరి..

దేవర సినిమాలో రౌడీల్లో ఒకడిగా నటించిన ఆ వ్యక్తి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ సముద్రం దగ్గర పది ఊర్లకు కాపరిగా ఉంటాడు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తను ముందుండి చూసుకుంటాడు. అందరికి అండగా నిలబడి ఉంటాడు. సముద్రం దగ్గర ఫైట్ సీన్ ఉంటుంది. అందర్నీ నరికే సీన్. అది హైలెట్ ఉంటుంది, ఏకంగా పదివేల మందితో ఫైట్ సీన్. సముద్రం అంతా రక్తంతో నిండిపోద్ది. యాక్షన్ సీన్స్ ని మేము లైవ్ లో చూసి షాక్ అయ్యాం. ఎన్టీఆర్ నటన చూసి మైండ్ బ్లోయింగ్ అయిపోద్ది. సింగిల్ టేక్ లో చెప్పేస్తాడు అన్ని. సినిమా రిలీజయితే బట్టలు చింపేసుకుంటారు ఫ్యాన్స్, థియేటర్స్ బద్దలు అయిపోతాయి అంటూ దేవర స్టోరీ లైన్ ని లీక్ చేసి సినిమా పై మరింత హైప్ పెంచాడు.

అయితే ఈ వీడియో వైరల్ అవ్వడంతో కొంతమంది ఎందుకు ముందే లీక్ చేసావు స్టోరీ అని తిడుతూ ఎన్టీఆర్, దేవర మూవీ నిర్మాణ సంస్థలని ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని పోస్టులు, కామెంట్స్ పెట్టారు. దీంతో మూవీ యూనిట్ స్పందించి ఆ వీడియోలని డిలీట్ చేయించినట్లు తెలుస్తుంది.