MS Dhoni: చెపాక్‌లో చ‌రిత్ర సృష్టించిన ధోని.. తొలి వికెట్ కీప‌ర్‌గా అరుదైన ఘ‌న‌త‌

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL )లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో 200 వికెట్లలో((క్యాచ్‌లు, స్టంపింగ్‌లు, రనౌట్‌లు) భాగ‌మైన తొలి వికెట్ కీప‌ర్‌గా అరుదైన ఘ‌న‌త సాధించాడు.

MS Dhoni: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL )లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో 200 వికెట్లలో((క్యాచ్‌లు, స్టంపింగ్‌లు, రనౌట్‌లు) భాగ‌మైన తొలి వికెట్ కీప‌ర్‌గా అరుదైన ఘ‌న‌త సాధించాడు. చెన్నైలోని చిదంబ‌రం స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ధోని ఈ రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌లో ధోని ఓ క్యాచ్ అందుకోవ‌డంతో పాటు ఓ ర‌నౌట్‌, ఓ స్టంపింగ్ చేశాడు.

ధోని త‌న ఐపీఎల్ కెరీర్‌లో 137 క్యాచ్‌లు, 40 స్టంపింగ్‌లు, 23 ర‌నౌట్‌ల‌ను చేశాడు. మ‌హేంద్రుడి త‌రువాతి స్థానాల్లో దినేశ్ కార్తిక్‌(187), ఏబీ డివిలియ‌ర్స్‌(140) ఉన్నారు. వీరిలో ప్ర‌స్తుతం దినేశ్ కార్తిక్ మాత్ర‌మే ఐపీఎల్ ఆడుతుండ‌గా ఏబీ డివిలియ‌ర్స్ ఇప్ప‌టికే క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు. దీంతో ధోని రికార్డును అందుకునే అవ‌కాశం ఒక్క డీకే కే ఉంది. అయితే అది క‌ష్ట‌మే కావొచ్చు.

IPL 2023, CSK vs SRH: కాన్వే జోరు.. హైద‌రాబాద్ బేజారు

ప్ర‌పంచ రికార్డు

ఓవ‌రాల్‌గా టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న ఆట‌గాడిగానూ ధోని రికార్డు నెల‌కొల్పాడు. ఈ క్ర‌మంలో ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు క్వింట‌న్ డికాక్ ను అధిగ‌మించాడు. డికాక్ 207 క్యాచ్‌లు అందుకోగా ధోని 208 క్యాచ్‌ల‌తో అగ్ర‌స్థానానికి చేరాడు. వీరిద్ద‌రి త‌రువాత దినేష్ కార్తీక్ (205 క్యాచ్‌లు), కమ్రాన్ అక్మల్ (172)లు ఉన్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన స‌న్‌రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 134 ప‌రుగులు చేసింది. ల‌క్ష్యాన్ని చెన్నై మూడు వికెట్లు కోల్పోయి 18.4 ఓవ‌ర్ల‌లో ఛేదించింది. చెన్నై బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ డేవాన్ కాన్వే(77 నాటౌట్‌; 57 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ‌శ‌త‌కంతో ఆక‌ట్టుకోగా రుతురాజ్ గైక్వాడ్‌(35; 30 బంతుల్లో 2 ఫోర్లు) రాణించాడు.

MS Dhoni:క్రేజీ ఫ్యాన్.. ధోనిని చూసేందుకు ఏకంగా బైక్ అమ్మేశాడు..!

ట్రెండింగ్ వార్తలు