Rohit Sharma Emotions : నెరవేరిన కల.. ప్రపంచకప్ సాధించగానే రోహిత్ శర్మ నేలపై పడుకుని..
టీమ్ఇండియా అభిమానుల, ప్లేయర్ల కల నెరవేరింది.
- Thota Vamshi Kumar
- Published on- June 30, 2024 / 08:49 AM IST
Rohit Sharma Emotions
టీమ్ఇండియా అభిమానుల, ప్లేయర్ల కల నెరవేరింది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. అద్భుత ఆటతీరును ప్రదర్శించిన భారత జట్టు టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. నరాలు తెగె ఉత్కంఠ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో యావత్ భారత్ దేశంలో సంబరాలు చేసుకున్నారు. ఆటగాళ్లు ఎగిరి గంతులు వేశారు. అయితే.. నాయకుడిగా, బ్యాటర్‌గా జట్టును ముందు ఉండి నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి లోనైయ్యాడు.
మ్యాచ్ పూర్తి కాగానే మైదానంలో కింద పడుకున్న రోహిత్.. సాధించాం అనే ఆనందంలో తన కుడి చేతితో నేలపై మూడు నాలుగు సార్లు బలంగా బాదాడు. రోహిత్ నాయకత్వంలో భారత జట్టు గతంలో రెండు సార్లు ఐసీసీ ఫైనల్స్‌కు చేరుకున్నప్పటికీ ఓటమి తప్పలేదు. 2023 డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు వన్డే ప్రపంచకప్ 2023లో తృటిలో భారత జట్టు కప్పును గెలుచుకోలేకపోయింది. తన కెరీర్లో ఆఖరి టీ20 ప్రపంచకప్ ఆడిన రోహిత్ ప్రపంచకప్ గెలవాలనే తన కలను నెరవేర్చుకున్నాడు.
హార్దిక్ పాండ్యాకు ముద్దు పెట్టిన రోహిత్.. హార్ధిక్ రియాక్షన్ చూశారా..! వీడియో వైరల్
దీంతో రోహిత్ భావోద్వేగానికి లోనైయ్యాడు. ఆనంద బాష్పాలు సైతం వచ్చాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ధోని తరువాత టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా చరిత్ర పుటల్లో తన పేరును రోహిత్ శర్మ సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అయితే.. తన కల నెరవేరిన వెంటనే అతడు టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయం అని అన్నాడు. తన సహచరుడు విరాట్ కోహ్లీ సైతం పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.
టీమిండియా విజయం తరువాత సచిన్, ధోనీల ఫస్ట్ రియాక్షన్ ఏంటో తెలుసా.. సోషల్ మీడియాలో వైరల్ ..
‘ఇది నా చివరి ఆట కూడా. వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం లేదు. నేను గెలవాలని కోరుకున్నా. అనుకున్నది సాధించా.’ అని రోహిత్ అన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ పై ఈ ఫార్మాట్లో అరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ తన కెరీర్లో 159 మ్యాచులు ఆడాడు. 32.05 సగటుతో 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు ఉన్నాయి.
