హార్దిక్ పాండ్యాకు ముద్దు పెట్టిన రోహిత్.. హార్ధిక్ రియాక్షన్ చూశారా..! వీడియో వైరల్

టీమిండియా విజయంతో స్టేడియంలో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నితాకాయి. హార్దిక్ పాండ్యా కన్నీటి పర్యాంతమయ్యాడు. అయితే, మ్యాచ్ అనంతరం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

హార్దిక్ పాండ్యాకు ముద్దు పెట్టిన రోహిత్.. హార్ధిక్ రియాక్షన్ చూశారా..! వీడియో వైరల్

Rohit sharma and hardik panda

Updated On : June 30, 2024 / 8:45 AM IST

Hardik Pandya : సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. భారత్ మళ్లీ విశ్వవిజేతగా నిలిచింది. ఎప్పుడో 2007లో టీ20 ప్రపంచకప్ మొదలైనప్పుడు ఆ టైటిల్ ను సొంతం చేసుకున్న భారత్ జట్టు.. మధ్యలో ఏడు టీ20 వరల్డ్ కప్ ల విరామం తరువాత ఇన్నేళ్లకు మళ్లీ ఇప్పుడు ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. శనివారం ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నాటకీయ మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతూ చివరికి టీమిండియాను విజయం వరించింది. అద్భుత విజయంతో టీమిండియా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని తాకాయి. హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. అయితే, ఈ క్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

Also Read : Rohit-Virat : విజ‌యంతో టీ20ల‌కు రోహిత్ శ‌ర్మ‌, కోహ్లి వీడ్కోలు.. ఇంత‌కంటే మంచి స‌మ‌యం ఉండ‌దంటూ..

ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా విజేతగా నిలవడంలో హార్దిక్ పాండ్యా పాత్ర మరవలేనిది. కీలక సమయంలో బౌలింగ్ చేసిన హార్దిక పాండ్యా రెండు కీలక వికెట్లుతీశాడు. క్లాసెన్ (52 పరుగులు) అద్భుత బ్యాటింగ్ చేశాడు. వరుసగా సిక్సులు, ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో మ్యాచ్ మొత్తం సౌతాఫ్రికా చేతుల్లోకి వెళ్లిపోయింది. క్లాసెన్, మిల్లర్ ఔట్ అయితే తప్ప టీమిండియా విజయం సాధ్యంకాని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేశాడు. క్లాసెన్, మిల్లర్ రెండు వికెట్లను పడగొట్టాడు. దీంతో టీమిండియా విజయం ఖాయమైంది.

Also Read : టీమిండియా విజయం తరువాత సచిన్, ధోనీల ఫస్ట్ రియాక్షన్ ఏంటో తెలుసా.. సోషల్ మీడియాలో వైరల్ ..

టీమిండియా విజయంతో స్టేడియంలో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నితాకాయి. మ్యాచ్ అనంతరం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీమిండియా విజయం పట్ల తన సంతోషాన్ని మీడియాకు తెలియజేస్తున్న క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చి హార్దిక్ పాండ్యా బుగ్గపై ముద్దుపెట్టుకొని అభినందించాడు. దీంతో సంతోషం వ్యక్తం చేసిన పాండ్యాసైతం రోహిత్ ను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికితోడు విజయం అనంతరం హార్దిక్ పాండ్యా తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్న సమయంలో రోహిత్ శర్మ హార్దిక్ వద్దకు వెళ్లి అతన్ని ఎత్తుకొని ఓదార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను ఐసీసీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్ల మధ్య ఎన్ని మనస్పర్థలు ఉన్నా.. ఇండియాకోసం ఆడేటప్పుడు అందరూ ఒకేమాటపై ఉంటారని చెప్పడానికి రోహిత్, పాండ్యాలే నిదర్శనమని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు.

Also Read: చరిత్రలో నిలిచిపోయే క్యాచ్..! కళ్లు చెదిరే క్యాచ్ తో టీమిండియాను గెలిపించిన సూర్య.. వీడియో వైరల్

 

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)