Rohit-Virat : విజయంతో టీ20లకు రోహిత్ శర్మ, కోహ్లి వీడ్కోలు.. ఇంతకంటే మంచి సమయం ఉండదంటూ..
17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణను తెరపడింది. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో టీమ్ఇండియా విజయం సాధించింది

Virat Kohli and Rohit Sharma Retires From T20Is Post Historic T20 World Cup 2024 Win
17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా విజయం సాధించింది. దీంతో యావత్ భారత దేశంలో సంబరాల్లో మునిగిపోయింది. ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న ప్రపంచకప్ సొంతం కావడంతో టీమ్ఇండియా ఆటగాళ్లు భావోద్వేగానికి లోనైయ్యారు. ముఖ్యంగా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లిల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదే సరైన సమయం అంటూ వీరిద్దరు టీ20 క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు.
టీమ్ఇండియా చారిత్రాత్మక విజయం సాధించిన నిమిషాల తర్వాత కోహ్లి తన రిటైర్మెంట్‌ను ప్రకటించగా, భారత కెప్టెన్ రోహిత్ శర్మ అధికారిక పోస్ట్ మ్యాచ్ విలేకరుల సమావేశంలో ప్రకటించాడు. వన్డేలు, టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తానని రోహిత్ ధృవీకరించాడు.
చరిత్రలో నిలిచిపోయే క్యాచ్..! కళ్లు చెదిరే క్యాచ్ తో టీమిండియాను గెలిపించిన సూర్య.. వీడియో వైరల్
‘ఇది నా చివరి ఆట కూడా. వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం లేదు. నేను గెలవాలని కోరుకున్నా. అనుకున్నది సాధించా.’ అని రోహిత్ అన్నాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ పై ఈ ఫార్మాట్‌లో అరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ తన కెరీర్‌లో 159 మ్యాచులు ఆడాడు. 32.05 సగటుతో 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు ఉన్నాయి.
అటు కోహ్లి విషయానికి వస్తే.. 2010లో జింబాబ్వే పై టీ20ల్లో అరంగ్రేటం చేసిన కోహ్లి 125 మ్యాచుల్లో 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. తన చివరి మ్యాచ్ అయిన ప్రపంచకప్ పైనల్లో 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 76 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు.
‘నా చివరి టీ20 ప్రపంచకప్‌ను ఎలా ముగించాలని అనుకున్నానో అలాగే ముగించా. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచే కెరీర్‌లో ఆఖరిది. భవిష్యత్ తరం వచ్చే సమయం ఇది.’ అని ఫైనల్ అనంతరం కోహ్లి చెప్పాడు.
T20 World Cup Final : జయహో భారత్.. ప్రపంచ ఛాంపియన్ రోహిత్ సేనకు అభినందనల వెల్లువ..