టీమిండియా విజయం తరువాత సచిన్, ధోనీల ఫస్ట్ రియాక్షన్ ఏంటో తెలుసా.. సోషల్ మీడియాలో వైరల్ ..

టీమిండియా అద్భుత ఆటతీరుతో టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలవడం పట్ల దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీలు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు చేశారు.

టీమిండియా విజయం తరువాత సచిన్, ధోనీల ఫస్ట్ రియాక్షన్ ఏంటో తెలుసా.. సోషల్ మీడియాలో వైరల్ ..

Teamindia Celebrations

T20 World Cup 2024 Final : సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. భారత్ మళ్లీ విశ్వవిజేతగా నిలిచింది. ఎప్పుడో 2007లో టీ20 ప్రపంచకప్ మొదలైనప్పుడు ఆ టైటిల్ ను సొంతం చేసుకున్న భారత్.. మధ్యలో ఏడు టీ20 వరల్డ్ కప్ ల విరామం తరువాత ఇన్నేళ్లకు మళ్లీ ఇప్పుడు ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. శనివారం ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నాటకీయ మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతూ చివరికి టీమిండియాను విజయం వరించింది. అద్భుత విజయంతో టీమిండియా ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని తాకాయి. రోహిత్, కోహ్లీ, హార్దిక్ పాండ్యా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. టీమిండియా అద్భుత ఆటతీరుతో టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలవడం పట్ల దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీలు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు చేశారు.

Also Read: Rohit-Virat : విజ‌యంతో టీ20ల‌కు రోహిత్ శ‌ర్మ‌, కోహ్లి వీడ్కోలు.. ఇంత‌కంటే మంచి స‌మ‌యం ఉండ‌దంటూ..

టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచిన టీమిండియా జట్టుకు సోషల్ మీడియా వేదికగా మహేంద్ర సింగ్ ధోనీ శుభాకాంక్షలు తెలిపారు. ధోనీ పోస్టు ప్రకారం.. నా గుండె వేగం పెరిగింది. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ప్రశాంతంగా, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండటం, ఏం చేయాలో అది చేయడం జట్టు విజయానికి కలిసొచ్చింది. ప్రపంచ కప్ ను తెచ్చినందుకు స్వదేశంలోని భారతీయులతోపాటు విదేశాల్లోని భారతీయులందరి తరపున కృతజ్ఞతలు. అమూల్యమైన పుట్టినరోజు బహుమతికి అభినందనలు అంటూ ధోనీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాశారు.

Also Read: చరిత్రలో నిలిచిపోయే క్యాచ్..! కళ్లు చెదిరే క్యాచ్ తో టీమిండియాను గెలిపించిన సూర్య.. వీడియో వైరల్

టీమిండియా జట్టు టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలవడం పట్ల క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంతోషం వ్యక్తం చేశారు. తన ఆనందాన్ని ఎక్స్ (ట్విటర్) ద్వారా పంచుకున్నారు. రెండు వన్డే ప్రపంచ కప్ లు, రెండు టీ20 ప్రపంచ కప్ లతో భారత్ ఇప్పుడు ఫోర్ స్టార్ సాధించిందని సచిన్ పేర్కొన్నారు. టీమిండియా జెర్సీ పై చేరే ఒక్కో స్టార్ దేశంలోని చిన్నారుల్లో స్ఫూర్తి నింపుతుందని, వారి కలలను చేరుకోవడానికి మరింత దగ్గర చేస్తుందని అన్నారు. ఈ విజయంలో నా స్నేహితుడు రాహుల్ ద్రవిడ్ సహకారం అపారమైంది. ఈ విజయంలో ద్రవిడ్ భాగస్వామి అయినందుకు నేను సంతోషంగా ఉన్నానని సచిన్ అన్నారు.

సూర్య కుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్.. రోహిత్ శర్మ సూపర్ కెప్టెన్సీ.. ఆటగాళ్ల అద్భుత ఆటతీరు.. మొత్తానికి సమిష్టి కృషితో టీ20 వరల్డ్ కప్ విజేతగా ఇండియా నిలిచిందని సచిన్ అన్నారు. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులకు అర్హులు. ముఖ్యమైన సమయంలో వారు అద్భుతంగా రాణించారు. జట్టు విజయంలో కీలక భూమిక పోషించిన ఆటగాళ్లతో పాటు కోచ్ లు, సహాయక సిబ్బంది, అందరికీ హృదయపూర్వక అభినందనలు అంటూ సచిన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by M S Dhoni (@mahi7781)