Rohit Sharma : ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన త‌రువాత రోహిత్ శ‌ర్మ వ్యాఖ్య‌లు.. మేం కాదు.. ఈ ప్ర‌పంచ‌క‌ప్ అందుకునేందుకు అస‌లైన అర్హుడు అత‌డే..

చాలా ఏళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది.

చాలా ఏళ్ల సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. టీమ్ఇండియా విశ్వ‌విజేత‌గా నిలిచింది. ఫైన‌ల్ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికాను 7 ప‌రుగుల తేడాతో ఓడించి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిలిచింది. దీంతో 17 ఏళ్ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌, 11 ఏళ్ల ఐసీసీ టోర్నీ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది. ఈ మ్యాచ్‌లో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 176 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లి (76), అక్ష‌ర్ ప‌టేల్ (47) లు రాణించారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ద‌క్షిణాప్రికా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలుచుకోవ‌డంతో చాలా సంతోషంగా ఉంద‌ని మ్యాచ్ అనంత‌రం టీమ్ఇండియా కెఫ్టెన్ రోహిత్ శ‌ర్మ అన్నాడు. క‌ల నెర‌వేరింద‌న్నాడు. ఈ క్ష‌ణం కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూసిన‌ట్లు చెప్పుకొచ్చాడు. త‌మ అంద‌రి కంటే ప్ర‌ధాన కోచ్ రాహుల్ ద్ర‌విడ్ ఈ ట్రోఫీ అందుకునేందుకు అస‌లైన అర్హుడు అని తెలిపాడు. గ‌త 20 నుంచి 25 ఏళ్లుగా భార‌త క్రికెట్‌కు అత‌డెంతో సేవ చేశాడ‌న్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డి ఖాతాలో ఇదో లోటుగా ఉండేది. అది ఇది పంపూర్ణమైంద‌ని చెప్పాడు.

T20 WC 2024 Final : టీ20 ఛాంపియ‌న్‌గా భార‌త్‌.. రోహిత్ సేన‌కు ద‌క్కిన‌ ప్రైజ్‌మనీ ఎంతంటే?

ఇక ద్ర‌విడ్ కోసం ప్ర‌పంచ‌క‌ప్‌ను సాధించినందుకు జ‌ట్టు మొత్తం సంతోషంగా ఉంద‌న్నాడు. ప్ర‌స్తుతం ద్ర‌విడ్ ఎంత సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నాడో మీరు చూశారు. ఒక టోర్నమెంట్‌ను గెలవాలంటే జ‌ట్టులోని ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ వంతు పాత్ర పోషించాలి. ఈ టోర్నీలో మా బాయ్స్ అదే చేసి చూపించారు. జ‌ట్టు మెనెజ్‌మెంట్ కూడా ప్రతీ ఒక్క ఆట‌గాడికి పూర్తి స్వేఛ్చ‌ను ఇచ్చింది. ఈ విజ‌యం వెన‌క సపోర్ట్ స్టాఫ్ కష్టం కూడా దాగి ఉంది. ఇక విరాట్ ఒక వ‌ర‌ల్డ్‌క్లాస్ ప్లేయ‌ర్ అని రోహిత్ తెలిపాడు.

ఇక ఈ విజ‌యంలో ప్ర‌తి ఒక్క‌రి పాత్ర ఉంద‌న్నాడు. ఈ విజ‌యం 140 కోట్ల మంది భారతీయులకు సంతోషాన్నిచ్చిందని భావిస్తున్నా అని రోహిత్ అన్నాడు.

IND vs SA : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో టీమ్ఇండియా విజ‌యానికి 5 ప్ర‌ధాన కార‌ణాలు ఇవే..

ట్రెండింగ్ వార్తలు