MS Dhoni:క్రేజీ ఫ్యాన్.. ధోనిని చూసేందుకు ఏకంగా బైక్ అమ్మేశాడు..!

ధోని బ్యాటింగ్ చేసేట‌ప్పుడు 'ధోని ధోని' అంటూ మైదానంలోని ప్రేక్ష‌కులు నినాదాల‌తో హోరెత్తిస్తుంటారు. సోమ‌వారం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అయితే.. ఓ అభిమాని ప‌ట్టుకున్న ఫ్ల‌కార్డు మాత్రం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

MS Dhoni: మ‌న దేశంలో క్రికెట్ అంటే ఓ మ‌తం లాంటిది. ఇక్క‌డ క్రికెట‌ర్ల‌ను దేవుళ్లుగా కొలిచే అభిమానులు ఉంటారు. త‌మ అభిమాన క్రికెట‌ర్ల‌ను క‌లుసుకునేందుకు లేదా నేరుగా వారి ఆట‌ను చూసేందుకు వారు చేయ‌ని ప్ర‌య‌త్నాలు ఉండ‌వు. ఇందుకోసం ఒక్కొసారి వారు చేసే ప‌నుల‌ను చూస్తే న‌వ్వాలో ఏడ‌వాలో అర్థం కాదు. సోమ‌వారం బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ఓ అభిమాని చేసిన ప‌ని ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మ‌హేంద్ర సింగ్ ధోని.. భార‌త జ‌ట్టుకు రెండు ప్ర‌పంచ‌క‌ప్‌లు(2007 టీ20, 2011 వ‌న్డే)లు అందించిన ఏకైక కెప్టెన్‌. దాదాపు 14 ఏళ్ల పాటు టీమ్ఇండియాకు త‌న‌దైన ఫినిషింగ్‌తో ఎన్నో అద్భుతమైన విజ‌యాలు అందించాడు. అటు ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా నాలుగు సార్లు ఆ జ‌ట్టును విజేత‌గా నిలిపాడు. ధోనికి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యి నాలుగు సంవ‌త్స‌రాలు అవుతున్నా కూడా ఐపీఎల్‌లో అతడి చూసేందుకే స్టేడియాల‌కు వ‌స్తున్నారు అంటే అతిశ‌యోక్తి కాదేమో.

IPL 2023, RCB vs CSK: బెంగళూరుపై చెన్నై గెలుపు Live Updates

ఇక ధోని బ్యాటింగ్ చేసేట‌ప్పుడు ‘ధోని ధోని’ అంటూ మైదానంలోని ప్రేక్ష‌కులు నినాదాల‌తో హోరెత్తిస్తుంటారు. సోమ‌వారం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అయితే.. ఓ అభిమాని ప‌ట్టుకున్న ఫ్ల‌కార్డు మాత్రం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ‘నేను నా బైక్‌ను అమ్మాను. త‌లా ధోనిని చూసేందుకు. గోవా నుంచి బెంగళూరులోని చిన్న‌స్వామి స్టేడియానికి వ‌చ్చాను.’ అని దానిపై రాసి ఉంది.

పిచ్చి అంటే ఇదేనేమో అని ఓ నెటీజ‌న్ కామెంట్ చేయ‌గా, ధోని అంటే మ‌రీ ఇంత అభిమానం ఉండాలా భ‌య్యా అంటూ మ‌రొక‌రు అన్నారు. ఏదీ ఏమైనా ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 226 పరుగులు చేసింది. అనంత‌రం ఆర్‌సీబీ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 218 ప‌రుగుల‌కే ప‌రిమితం కావ‌డంతో చెన్నై 8 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ధోనికి కేవ‌లం ఒక్క బంతి ఆడే అవ‌కాశం మాత్ర‌మే రాగా ఒక్క ప‌రుగు తీసి నాటౌట్‌గా నిలిచాడు.

MS Dhoni: హీరోలు తయారుకారు.. పుడతారు..! ధోనీపై ప్రశంసలతో సినీ నటి ఖుష్భూ ట్వీట్

ట్రెండింగ్ వార్తలు